Pooja Room Tips: మీ పూజ గదిలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి.. ఎన్ని ఉండాలి, ఉండకూడదో తెలుసా?

హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది అన్నది తప్పనిసరిగా ఉంటుంది. పూజ గదిలో ఎంతోమంది దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు ఉంటాయి. కొందరు పెద్దపెద్ద విగ్

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 09:11 PM IST

హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది అన్నది తప్పనిసరిగా ఉంటుంది. పూజ గదిలో ఎంతోమంది దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు ఉంటాయి. కొందరు పెద్దపెద్ద విగ్రహాలను పెట్టుకుని పూజిస్తే మరి కొందరు చిన్న చిన్న విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. కొందరు దేవుడికి నిత్య పూజ చేస్తూ ఉంటారు. పూజ చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు కనిపిస్తాయి. పూజ చేయడం మంచిదే కానీ కొన్ని రకాల నియమాలు పాటించడం అన్నది తప్పనిసరి. మరి ఆ నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దేవుడిగది ఎప్పుడు ఇంటికి దక్షిణంవైపు ఉండకూడదు. దేవుని విగ్రహం కూడా దక్షిణ దిశలో ఉండకూడదు.

ఈ దిశలో ఉంచడం అశుభం. దీనివల్ల వాస్తు దోషం ఏర్పడి కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఉత్తర దిశలో దేవుని విగ్రహాలను ప్రతిష్టిస్తే చాలా మంచిది. కానీ ఇంటి దేవుడి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రటి వస్త్రంపై ప్రతిష్టించకూడదు. దాని వల్ల దుష్పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలు ఉండకూడదు. ఫొటోలు పెట్టుకుంటే ఇబ్బంది లేదు కానీ విగ్రహం మాత్రం ఒకటి ఉండాలి. అనుకోకుండా 1 కంటే ఎక్కువ దేవుని విగ్రహాన్ని ఉంచడం వలన మీ జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి నరకానికి దారి తీస్తుంది. దేవుని విగ్రహాలను ఇంటికి పడమర దిక్కున పెట్టకూడదు. దీనివల్ల ఫలితం ఉండదు.

దేవుడి విగ్రహాన్ని పడమర దిక్కున పెట్టి అలాగే పూజ చేసినా దాని వల్ల ఎలాంటి మేలు జరగదు. దేవుని విగ్రహాన్ని ఇంటికి ఉత్తర, ఈశాన్య దిశలలో ప్రతిష్టించవచ్చు. అలాగే దేవుడి విగ్రహాన్ని నీలిరంగు వస్త్రంపై ప్రతిష్టిస్తే ఫలితం ఉంటుంది. అలాగే, ఇది మీ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. దేవుడి విగ్రహాలు కూడా ఇంటి యజమాని బొటన వేలు కంటే తక్కువగా ఉన్న విగ్రహాలని పెట్టుకుని పూజించడం మంచిది.