Cleaning Rituals: పూజ గదిని శుభ్రం చేస్తున్నారా.. పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న ఇల్లు ఉన్న వారు ప్రత్యేకంగా పూజ గది లేకపోయినా కూడా చిన్న దేవుడ

  • Written By:
  • Publish Date - July 24, 2023 / 08:00 PM IST

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న ఇల్లు ఉన్న వారు ప్రత్యేకంగా పూజ గది లేకపోయినా కూడా చిన్న దేవుడి ఫోటో అయినా పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. ఇంకొందరు వాస్తు ప్రకారం గా పెద్దగా పూజ గదిని నిర్మించుకుంటూ ఉంటారు. అయితే చాలామంది పూజ చేసేటప్పుడు పూజగది శుభ్రం చేసేటప్పుడు అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. పూజగదిని శుభ్రం చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనకు సమస్యలను సృష్టిస్తుంది.

కాబట్టి పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో పరమ పవిత్రమైన ప్రదేశం దేవుని గది. ఈ గదికి సంబంధించి చాలా నియమాలు పాటిస్తారు. అయితే ఈ దేవుడి గదిని శుభ్రం చేసేటపుడు పొరపాటున తప్పులు చేస్తే సమస్యలు, కష్టాలు తప్పదు. శనివారాల్లో పూజ గదిని శుభ్రం చేయాలి. శనివారం నాడు ఇలా శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి. అలాగే, ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. శనివారం పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి. అలాగే గంగాజలాన్ని పోయడం ద్వారా లక్ష్మీ కృపను పొందవచ్చు.

దీపం లేకుండా దేవుని పూజ గది రెండూ అసంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో దీపాన్ని కూడా తప్పకుండా శుభ్రం చేయాలి. దీపాన్ని నీటితో శుభ్రం చేసి, ఆరబెట్టి, చాలా త్వరగా వెలిగించాలి. శనివారం వీలుకాకపోతే ఏకాదశి, గురువారాల్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు. దీని ద్వారా విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. అదేవిధంగా గురువారం పూజకు ముందు గంగాజలం చల్లాలి. దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు విగ్రహాలను నేలపై ఉంచుతారు. కానీ ఇలా చేయడం తప్పు. శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత, నేలపై దేవుని ఫోటో విగ్రహాన్ని ఉంచకూడదు. అలా కాకుండా ఎత్తైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి. దేవుని గదిలో పూజ చేసిన తరువాత, తలుపు మూసివేయాలి. శాస్త్ర ప్రకారం పూజ చేసేటప్పుడు దేవుడికి కర్పూరం వాడాలి. అలా ఎప్పుడు అన్ని ఉపయోగించడం వల్ల పితృ దోషం వాస్తు దోషాలను తొలగిస్తుంది.