Pooja: మామూలుగా స్త్రీలకు ప్రతి నెల పీరియడ్స్ రావడం అన్నది సహజం. అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు స్త్రీలు దాదాపు 5 రోజుల పాటు పూజ గదికి దూరంగా ఉంటారు. పూజలు చేయడం సంగతి పక్కన పెడితే కనీసం పూజ గది వైపు వెళ్లడం కానీ పూజా సామాగ్రి ముట్టుకోవడం కూడా చేయరు. అయితే మరి పీరియడ్స్ వచ్చిన తర్వాత రోజు స్త్రీలు పూజ గదిలో దీపారాధన చేయవచ్చో, చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పీరియడ్స్ వచ్చిన తర్వాత మొదటి మూడు రోజులు పూజ చేయడం అస్సలు మంచిది కాదట. మామూలు దీపారాధన కూడా చేసుకోవడం తప్పే అని చెబుతున్నారు. అలాగే సూర్య నమస్కారాలు వంటివి చేయడం కూడా అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. మూడు రోజుల తర్వాత అనగా నాలుగవ రోజు తల స్నానం చేయాలట. ఇక 5వ రోజు మారు స్నానం తర్వాత మాత్రమే పూజ గదిలోకి వెళ్లాలని అంతవరకు పూజ గదిలోకి వెళ్ళకూడదని చెబుతున్నారు.
ఇలా ఐదవ రోజు మారు స్నానం చేసిన తర్వాత ఇంట్లోనే పూజ గదిలోకి వెళ్లి దీపారాధన చేయవచ్చు అని చెబుతున్నారు. అదేవిధంగా ఎవరైనా వాయనానికి పిలిచినా కూడా 5వ రోజు మాత్రమే వెళ్లాలని చెబుతున్నారు. 5వ రోజు తప్ప మిగిలిన నాలుగు రోజులు పనికిరావని ఆ నాలుగు రోజుల్లో అలాంటి పనులు కూడా చేయకూడదని చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఈ నాలుగు రోజులపాటు తులసి మొక్కను తాకడం తులసి దళాలు కోయడం తులసి మొక్కకు నీరు సమర్పించడం లాంటివి అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుళ్ళకు సంబంధించిన ఒక్క పని కూడా చేయకూడదట.
Pooja: పీరియడ్స్ తర్వాత 5వ రోజు స్త్రీలు దీపారాధన చేయవచ్చా?

Pooja