Site icon HashtagU Telugu

Daily Puja: పూజకు కొన్ని రూల్స్ ఉన్నాయట.. ఆ తప్పు అస్సలు చేయొద్దట!

Tulsi Plant Don't Forget These Things Even By Mistake While Doing Tulsi Puja..

Tulsi Plant Don't Forget These Things Even By Mistake While Doing Tulsi Puja..

Daily Puja: సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది. కాని నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి. సంకల్పంలోనే ఉంది “ధర్మపత్నీ సమేతస్య” అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ.. ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా..? అందువలన పురుషుడు వళ్ళు వంచి ప్రతిరోజూ పూజ చేయ్యాలి.

అదేవిదంగా నైమిక్తిక తిథులలో గాని, వ్రతమప్పుడు గాని పూజ చేసేటప్పుడు ధర్మపత్నీ, పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి. ఇక వస్త్రధారణ విషయనికి వస్తే ప్రధానంగా.. ఆడపిల్ల అయితే లంగా వోణీ, వివాహిత అయితే చీర కట్టుకోవాలి. అమ్మవారికి అవే కదా ప్రధానం. మరి పురుషుల విషయనికి వస్తే, పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది. “వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ” అనగా వికచ్ఛః అంటే గోచీ పెట్టుకోలేదు, అనుత్తరీయశ్చ అంటే పైన ఉత్తరీయం లేదు అని. గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబర అవుతుంది.

కాబట్టి పురుషుడికి ఉత్తరీయం ఉండాలి, అలాగే గోచీపోసి పంచె కట్టుకోవాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని “కచ్ఛము” అంటారు. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు. చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. కాబట్టి పురుషులు ఈ రెండు పద్దతులు తప్పనిసరిగా పాటించాలి.