Site icon HashtagU Telugu

Polala Amavasya: జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోవాలంటే.. పోలాల అమావాస్య రోజు ఇలా చేయాల్సిందే!

Polala Amavasya

Polala Amavasya

హిందూమతంలో పొలాల అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పొలాల అమావాస్య రోజున పూజలు చేయడం వల్ల తప్పకుండా ఆయా దేవుళ్ళ అనుగ్రహం పొందవచ్చు. మరి ముఖ్యంగా తులసి మొక్కకు ప్రదక్షిణ చేసే సంప్రదాయం ఉంది. జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలి అన్న, అనుకున్నది నెరవేరాలన్నా, కష్టాలు దూరం అవ్వాలి అన్నా ఈ పోలాల అమావాస్య రోజున తులసి దేవికి పూజ చేయాల్సిందే అంటున్నారు. మరి పోలాల అమావాస్య రోజు తులసి చెట్టుకు ఏ విధంగా పూజ చేయాలి ఏ సమయంలో పూజ చేయాలి అన్న విషయానికి వస్తే..

అయితే శ్రావణ మాసంలోని అమావాస్య సెప్టెంబర్ 2 సోమవారం ఉదయం 5:21 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 3న ఉదయం 7:24 గంటలకు ముగుస్తుంది. కనుక పోలాల అమావాస్యను సోమవారం, 2 సెప్టెంబర్ 2024న జరుపుకుంటారు. పోలాల అమావాస్య ఉదయం 4.38 గంటల నుంచి 5.24 గంటల వరకు బ్రహ్మ ముహూర్త సమయం ఉంటుంది. ఈ రోజున ఉదయం 6.09 నుండి 7.44 గంటల వరకు పూజలు నిర్వహించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అయితే ఈ అమావాస్య రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత తులసి మొక్క చుట్టూ గంగాజలంతో కడిగి శుభ్రం చేయాలి. ఆ తర్వాత తులసి మొక్కను అలంకరించి పూలు పెట్టి పూజ చేసి తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయాలి.

అయితే తులసి మొక్కను పుష్పాలు, చందనం మొదలైన వాటితో అలంకరించాలి. తులసి మొక్కను సవ్యదిశలో 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా ప్రదక్షణ చేసే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కానీ ఓం తులసి మాతా నమః అనే మంత్రాన్ని కానీ జపించాలి. అయితే ఈ అమావాస్య రోజున ఉపవాసంతో పూజ చేసి తులసి చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేయడం వల్ల అన్ని రకాల దుఃఖాలు తొలగిపోయే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే పోలాల అమావాస్య రోజున తులసికి ప్రదక్షిణ చేసే సమయంలో మనస్సులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు చేయరాదు. తులసి మొక్కను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

తులసి మొక్కను ఎప్పుడు బడితే అప్పుడు తీయరాదు. తులసిని సకల దేవతలకు ఇష్టమైనడిగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. విష్ణుమూర్తికి తులసి దళాలను నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి మొక్కను ఇంటి ఆవరణలో లేదా ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పోలాల అమావాస్య రోజున తులసికి ప్రదక్షిణ చేయడం ద్వారా అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారని నమ్మకం.

Exit mobile version