Ram Mandir: రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోడీ షెడ్యూల్

శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక ఈ రోజుతో తీరనుంది. దేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి భక్తులకు ఈ రోజు మర్చిపోలేని రోజుగా చరిత్రకెక్కనుంది.

Ram Mandir: శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక ఈ రోజుతో తీరనుంది. దేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి భక్తులకు ఈ రోజు మర్చిపోలేని రోజుగా చరిత్రకెక్కనుంది.

శతాబ్దానికి పైగా నాటి ఉద్వేగభరితమైన దేవాలయం-మసీదు వివాదాన్ని పరిష్కరించి, రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. దీంతో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం బిజెపి ప్రధాన అజెండాలో భాగమైంది. ఇప్పటికే మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని గురువారం మధ్యాహ్నం రామజన్మభూమి ఆలయ గర్భగుడిలో ఉంచారు.

ఈ రోజు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకుంటారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్‌ని అధికారికంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 10.30కి అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11 గంటలకు రామాలయానికి చేరుకుంటారు. అక్కడ ఆయన 3 గంటలపాటూ ఉంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 12.55 వరకూ బాల రాముడి 51 అంగుళాల విగ్రహం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటూ 4వేల మంది సాధువులు పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ.. బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు భక్తులతో మరో బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.10కి కుబేర్ తిలా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కాగా.. ఈ కార్యక్రమానికి 7,500 మంది ప్రముఖ అతిథులు హాజరుకానున్నారు

రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 13వేల మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. 10వేల సీసీ కెమెరాలు, యాంటీ మైన్ డ్రోన్లూ ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు . జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలు ఉంటాయి.

Also Read: Hyderabad : అయోధ్య రామ‌మందిరం కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌