Site icon HashtagU Telugu

Medaram : మేడారం భక్తులకు షాక్ ఇచ్చిన పూజారులు

CM Revanth Medaram Visit

CM Revanth Medaram Visit

మేడారం (Medaram ) జాతర.. ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర. మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి మేడారం గ్రామంలో కుంభమేళా మేడారం జాతర జరుగుతుంది. ప్రతి రెండేళ్లకు జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ మేడారం జాతర ఘనంగా జరగ్గా.. 1.40 కోట్ల మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో కంటే ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు దేవతలను దర్శించుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో జాతర అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లో ఎటు చూసిన బట్టలు, చెత్తా చెదారం, మరీ ముఖ్యంగా భక్తులు తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కవర్లుతో నిండిపోయింది. దీంతో వాటిని తొలగించేందుకు ఎన్నో వాలంటరీ సంస్థలు కష్ట పడినప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు దర్శనమిస్తునే ఉన్నాయి. అలాగే పూర్తిగా వ్యవసాయ క్షేత్రాలు కూడా వ్యవసాయానికి పనికిరాకుండా పోయే ప్రమాదంలో పడిపోయాయి. ఇలాగైతే రాబోయే రోజుల్లో పెను ప్రమాదమే అని భావించిన ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇక మీద నుంచి మేడారం వచ్చే భక్తులు ఎవరు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు ఉపయోగించకూడదని ఆదేశించారు. అలాగే మినీ జాతర సమయంలో కూడా ప్లాస్టిక్ ను పూర్తిగా బ్యాన్ (Plastic Ban) చేయనున్నట్లు తెలిపారు. మేడారం వచ్చే భక్తులు అడవిని, ప్రకృతిని కాపాడేందుకు గాను సులభంగా భూమిలో కరిగిపోయే బయోడిగ్రేడబుల్ సంచులు, పేపర్ ప్లేట్లు. పేపర్ కప్పులు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అలాగే ఆలయ పరిసరాల్లో దుకాణాల్లో కూడా ప్లాస్టిక్ కు సంబంధించిన వాటిని అమ్మవద్దని ఆదేశించారు. తమ నిర్ణయాన్ని కాదని ఎవరైనా ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేడారం పూజారుల సంఘం హెచ్చరించింది.

Read Also : Lok Sabha Speaker: స్పీకర్ పదవిపై రగడ..టీడీపీ కీ రోల్. కూటమిలో విభేదాలు

Exit mobile version