Plants: ఈ మొక్కలు ఇంట్లో పెంచితే.. దురదృష్టాన్ని ఆహ్వానించినట్టే?

చాలామంది ఇంటి పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా అందంగా ఉంచుకోవడం కోసం ఇంట్లో అనేక రకాల మొక్కలు చెట్లను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని ఇంటి లోపల

  • Written By:
  • Publish Date - May 16, 2023 / 07:10 PM IST

చాలామంది ఇంటి పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా అందంగా ఉంచుకోవడం కోసం ఇంట్లో అనేక రకాల మొక్కలు చెట్లను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని ఇంటి లోపల పెంచుకుంటే మరి కొన్ని గార్డెన్లో పెంచుకుంటూ ఉంటారు. కాగా తులసి, తామర, ఆర్కిడ్ వంటి మొక్కలు గాలిని శుద్ధి చెయ్యడంతో పాటు వాస్తు నియమాల్లో కూడా ఉంటాయి. కానీ కొన్ని మొక్కలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెంచుకోకూడదు. మరి మనం ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాక్టస్ మొక్క వాస్తు లేదా ఫెంగ్ ష్యూయి ఎక్స్పర్ట్స్ కాక్టస్ మొక్కలు అందంగా కనిపిస్తాయి.

కానీ వాటిని ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల అవి ఇంటిలోకి బ్యాడ్ లక్ ని ఆహ్వానిస్తాయి. ఈ మొక్కల్లో ఉండే పదునైన ముళ్లు నెగెటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేస్తాయని. ఈ మొక్కలు పెట్టుకుంటే ఇంటిలోకి దృరదృష్టాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. ఇవి ఇంట్లో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి. కాగా వీటిని టెర్రాస్ మీదో లేక కిటికి లో పెడితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతాయి. ఒకరకంగా అవి ఇంటికి కాపాలాగా ఉండే రక్షణ కవచాలు. బోన్సాయ్ మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఇవి ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇవి పెరుగుదల నిరోదకానికి గుర్తులు.

జీవన గమనంలో ఆటంకాలు ఏర్పరుస్తాయి. ముందుకు సాగడంలో అడ్డంకులకు కారణం కావచ్చు. ఎక్కువ శాతం ఈ బోన్సాయ్ మొక్కలను ఓపెన్ ప్రదేశంలో పెట్టుకోవడం మంచిది. పత్తి చెట్టు.. ఈ మొక్కలు ఇంటిదగ్గర పెంచుకోవడం అంత మంచిది కాదు. ఇవి వాస్తు పరంగా అంత మంచిది కాదు. వీటిని ఇంటిలోపల పెట్టుకుంటే చాలా అన్ లక్కీ అని అంటున్నారు. గోరింటాకు చెట్టు.. గోరింటాకు చెట్టు దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలాంటి మొక్కల్లో చింత చెట్టు కూడా ఒకటి. దీన్నీ కూడా ఇంట్లో ఫెట్టుకోకూదు. చింత చెట్టు పక్కన ఇంటి నిర్మాణం కూడా కూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఎటువంటి మొక్కలైనా సరే వాడి పోయి ఎండిపోయి కనిపించినా అవి ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇంట్లో ఉండే మొక్కలు పచ్చగా అందంగా కనిపించవచ్చు. అందుకే ఇంట్లో పెంచుకునే మొక్కలు పచ్చగా తాజాగా ఉండేలా జాగ్రత్త పడాలి. చచ్చిపోయిన లేదా ఎండిపోయిన మొక్కలు చెడుకు సంకేతాలు. కనుక వెంటనే తీసేయ్యాలి. ఈ మొక్కలు మాత్రమే కాకుండా ఇంట్లో ఖర్జూర, చెట్టు వెదురు చెట్టు, తుమ్మ చెట్టు వంటి మొక్కలను పెంచుకోకపోవడమే మంచిది. ఇంట్లో ఎటువంటి మొక్కలను పెంచుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. తులసి, మనీ ప్లాంట్, వేప చెట్టు, అరటి చెట్టు,తామర మొక్క వంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవడం మంచిది..