Site icon HashtagU Telugu

Vastu Tips : పారిజాత మొక్కను ఈ దిశలో నాటుతే…మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉన్నట్లే..!!

Parijatham 1

Parijatham 1

వాస్తుశాస్త్రం ప్రకారం..మొక్కలు ఇంట్లో వస్తువులు సరైన దిశలో…సరైన సమయంలో ఉంచడానికి ఎన్నో నియమాలు పాటించాలి. వాటిని పాటిస్తే…ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేస్తుంది. అలాంటి మొక్కలలో పారిజాత ఒకటి. దీనిని సాధారణ భాషలో పారిజాతం అని అంటుంటారు. పారిజాత పుష్పం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని శాస్త్రాలో ఉంది. పారిజాత పువ్వులు సువాసనను వెదజల్లుతుంటాయి. చెట్టు నుంచి ఆ పుష్ఫాలు వాటంతట అవే రాలిపోతాయి. ఈ పువ్వులు రాత్రి పూట వికసిస్తాయి. పారిజాతం మొక్కను ఇంట్లో నాటితే ఆ ఇంట్లో శాంతి నెలకొంటుందని నమ్ముతుంటారు.

ఈ పారిజాతం పువ్వులు ఆధ్యాత్మికంగానే కాదు…ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను తొలగిస్తుంది. ఈ పువ్వులు వెదజల్లే వాసన మానసిక సమస్యలను దూరం చేస్తుంది. మనస్సుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఆరోగ్యం కోసం ఇంట్లో పారిజాత మొక్కను నాటితే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారని..ఆయురారోగ్యాలను పొందుతారని నమ్ముతుంటారు. అంతేకాదు పారిజాతం పువ్వులను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అనేక రకాల వ్యాధుల నివారణ మందులకు దీనిని వాడుతుంటారు.

పారిజాతం మొక్కను ఈ దిశలో నాటండి.!!
ఇంట్లో పారిజాతమొక్కను నాటడానికి వాస్తుశాస్త్రంలో కొన్నినియమాలు ఉన్నాయి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టి, పాజిటివ్ ఎనర్జీ రావాలంటే పారిజాత మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.

పార్వతీదేవికి ఇష్టమైన పువ్వులు!!
పారిజాతం పువ్వులంటే పార్వతీదేవికి చాలా ఇష్టమట. ప్రతిరోజూ పారిజాతం పువ్వులను అమ్మవారికి సమర్పించినట్లయితే…ఆ ఇంట్లో సంతోషం, శ్రేయస్సు నెలకొంటుంది. పారిజాత పుష్పలతో శివుడికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతుంటారు.