Tulsi In Home: ఇంట్లో తులసి మొక్కతో పాటు ఆ మొక్కను నాటితే చాలు.. ధన ప్రవాహమే?

హిందూ సంస్కృతిలో తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి విష్ణువు కొలువై ఉంటారు. కాబట్టి తులసి మొక్కను భక్తిశ్ర

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 08:10 PM IST

హిందూ సంస్కృతిలో తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి విష్ణువు కొలువై ఉంటారు. కాబట్టి తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహంతో పాటు విష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది. అందుకే తులసి మొక్క వద్ద హిందువులు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో తులసి మొక్క వద్ద ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు ఎటువంటి దుష్ట శక్తులు దరి చేరవు. అలాగే ఆర్థికంగా కూడా లాభాలు చేపడుతాయి.

ఏకాగ్ర‌త‌, త‌దేక దీక్ష‌తో ఎంత పని చేసినా ఆ పని చెడిపోతుంటే ఇంట్లో కృష్ణ‌ తులసి మొక్కను నాటడం చాలా మంచిది. ఆ తర్వాత ప్రతిరోజు సాయంత్రం ఆ తులసి మొక్క ద‌గ్గ‌ర‌ స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయ‌డం వల్ల మీ ప‌నుల్లో ఆటంకాలు త్వ‌ర‌లోనే తొల‌గిపోతాయి. ఇంట్లో తులసి మొక్క ఉంటే దానితో పాటు అరటి మొక్కను కూడా నాటవచ్చు. రెండు మొక్కలు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. రెండు మొక్కలకు నీరు పోసి ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. కార్తీక మాసంలో 30 రోజులు తులసి మొక్క కింద నెయ్యి దీపం వెలిగించాలి.

మీరు దీపం వెలిగించలేకపోతే, దేవోత్థాన ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ వరకు కనీసం ఐదు రోజులు దీపం వెలిగించండి. తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవితో పాటు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటాలి. ఈ దిక్కును దేవతలకు నిలయంగా పరిగణిస్తారు.