Site icon HashtagU Telugu

Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో మీ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?

At House Tours 2022 01 Luna Tour Img 5048

At House Tours 2022 01 Luna Tour Img 5048

మామూలుగా మనం ఇంట్లో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అందులో కొన్ని రకాల మొక్కలు మనకు పాజిటివ్ ఎనర్జీని తెస్తే మరికొన్ని ముక్కలు నెగటివ్ ఎనర్జీని తెస్తాయి. అలాగే కొన్ని రకాల మొక్కలు మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. సంపద అభివృద్ధి పెరిగేలా చేస్తాయి.. అటువంటి వాటిలో కుబేరుడుకి ఇష్టమైన ఈ మూడు మొక్కలు కూడా ఒకటి. కుబేరుడుకి ఇష్టమైన మూడు చెట్లు ఇంటి అందాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తాయి. హిందూమతంలో ప్రతి దేవత ఒక పువ్వు లేదా ఒక చెట్టుతో సంబంధం కలిగి ఉంటుంది.

అలా చెట్లను, మొక్కలను ఇంట్లో నాటడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా కుబేరుడుకి ఇష్టమైన మూడు చెట్లు ఉన్నాయి. మూడు చెట్లను ఇంట్లో సరైన దిశలో నాటితే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. పసుపు మొక్క ఇంట్లో పసుపు మొక్కను నాటితే డబ్బు కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లో పసుపు మొక్క బృహస్పతిని బలపరుస్తుంది. పసుపు మొక్కను ఇంట్లో ఉత్తరం వైపున పెడితే, డబ్బు కష్టాలు తొలగిపోతాయి. ఐశ్వర్యం కూడా కలుగుతుందీ. కుబేరునికి ఇష్టమైన మరొక మొక్క మందార మొక్క. మందార మొక్కను ఉత్తర దిక్కున పెడితే డబ్బులకు ఇబ్బంది తొలగిపోతుంది. డబ్బు రావడానికి మార్గం సుగమం అవుతుందని మంగళ దోషం తొలగిపోతుంది.

ఇంట్లో ఎర్రటి మందార పూల మొక్కలను పెంచుకోవాలి. అయితే వీటిని ఉత్తరం దిక్కులో మాత్రమే పెట్టాలి. కుబేరునికి బాగా ఇష్టమైన మరొక మొక్క క్రాసులా. ఇంట్లో ఈ మొక్కను ఉంచితే ఇంటికి సంపద వస్తుంది. క్రాసులా మొక్కను ఇంటికి నైరుతి లేదా ఉత్తరం వైపు ఉంచితే ఉద్యోగ అవకాశాల పురోగతి ఉంటుంది. క్రాసులా మొక్క ఇంటికి సానుకూల శక్తిని బాగా ఆకర్షిస్తుంది. దీనిని ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదమని, డబ్బును అయస్కాంతంలా ఆకర్షించే గొప్ప శక్తి దీనికి ఉంటుంది. కనుక కుబేరుడుకి ఇష్టమైన ఈ మూడు మొక్కలను ఇంట్లో పెట్టుకుని డబ్బు ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించవచ్చు.