Sravana Masam:ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే శ్రావణ మాసంలో తులసితో పాటు ఈ మొక్కలను నాటాల్సిందే?

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు.. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో మనకు తులసి మొక్క

  • Written By:
  • Updated On - July 28, 2022 / 03:54 PM IST

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు.. అందుకే.. దాదాపు ప్రతి ఇంటి ఆవరణలో మనకు తులసి మొక్క క‌నిపిస్తుంది. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కనుక పెద్ద ఎత్తున నిత్యం పూజలు చేస్తూ తులసిని దైవ సమానంగా భావిస్తారు.అయితే నేటి నుంచి శ్రావణ మాసం మొదలవడంతో పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు.

అంత‌టి పవిత్రమైన తులసి మొక్కతోపాటు కొన్ని రకాల పూలు పండ్ల మొక్కలను నాటడం వల్ల మన ఇంట్లో ఏర్పడే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి తులసితో పాటు ఎలాంటి మొక్కలను నాటాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

బిల్వపత్ర: శివుడికి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రను తులసితో పాటు పూజించటం వల్ల సకల సంపదలు కలుగుతాయి. మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా ఆ పరమశివుడి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి.

జమ్మి చెట్టు: జమ్మి చెట్టును ఇంట్లో నాటడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా శని ప్రభావ దోషాలు తొలగిపోయి శనీశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి.

అరటి మొక్క: వాస్తు శాస్త్రం ప్రకారం అరటి మొక్క ఎన్నో శుభ ఫలితాలను కలిగిస్తుంది. అందుకే తులసితో పాటు అరటి మొక్కను నాటడం వల్ల విష్ణు దేవుని అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.అయితే తులసి మొక్కను అరటి మొక్కను నాటేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి తులసి ఎల్లప్పుడూ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపు ఉండగా అరటి మాత్రం కుడివైపు ఉండేలా నాటుకోవాలి.

ఉమ్మెత్త: పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్త పుష్పాలు ఒకటి. ఉమ్మెత్త పువ్వులతో స్వామివారికి పూజ చేయడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఇకపోతే ఉమ్మెత్త మొక్కను మంగళవారం లేదా ఆదివారంలో ఇంటి ఆవరణంలో నాటడం వల్ల మన ఇంటిలో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఇంటిల్లిపాదిపై పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. HashtagU దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.