Site icon HashtagU Telugu

Vasthu Tips: త్వరగా ధనవంతులు అవ్వాలా.. అయితే ఆ వస్తువు బురదలో ఉన్న తెచ్చుకోవాల్సిందే?

Vasthu Tips

Vasthu Tips

చాలామంది సమయం సందర్భానుసారం 2 వేల నోటు బురదలో పడితే దాని విలువ మారదు కదా అని చెబుతూ ఉంటారు. అయితే కేవలం సందర్భానుసారం మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా విలువైన వస్తువులు మురికిలో పడి ఉంటే వాటిని వెంటనే తీయాలి. అలా కాకుండా బురద అంటింది కదా అని తీయడానికి వెనుకాడకూడదు. బంగారం, వజ్రం లేదా వెండి వంటి విలువైన వస్తువులు మురికిలో పడి ఉంటే వెంటనే దానిని తీయాలి. అలా వాటిని తీయకపోతే వాటిని అవమానించినట్టు అవుతుంది.

అంటే విలువైన వస్తువులు మురికిలో పడిన, బురదలో పడిన కూడా వాటి విలువ తగ్గదు అని అర్థం. అదేవిధంగా ప్రతి మనిషిలో చెడు గుణాలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ చదువు గుణాలు ఉన్న వారికి దూరం అవుతూ మంచి గుణాలు ఉన్నవారిని, మంచి గుణాలను నేర్చుకునే విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. ఇలా మంచి గుణాలను నేర్చుకోవడంలో ముందడుగు వేసే వారు పురోగతిని పొందడంతో పాటు గొప్ప పేరు ప్రతిష్టలను కూడా సంపాదిస్తారు. అలాగే ఎప్పుడు కూడా బంగారం, వెండిలాగా రూపాయి డబ్బు కూడా మురికిలో పడి కూడా దాని విలువ తగ్గదు.

అందువల్ల, ఒక వ్యక్తి మురికిలో పడి ఉన్న డబ్బును చూస్తే వెంటనే దానిని తీయాలి. ఇలా చేయకపోవడం వల్ల డబ్బు అవమానించినట్లే అవుతుంది. కాబట్టి మంచి గుణాలు నేర్చుకోవడం వల్ల మంచి బుద్ధులు రావడంతో నడివడిగా బాగుంటుంది. అలాగే బురదలో పడిన ఎటువంటి విలువైన వస్తువు అయినా సరే దాన్ని తీయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి. దానివల్ల ధనవంతులు కూడా అవుతారు.