Site icon HashtagU Telugu

Vinayaka Chavithi: వినాయ‌క చ‌వితి రోజు ఈ విధంగా పూజ‌లు చేయండి!

Lord Ganesha

Lord Ganesha

Vinayaka Chavithi: భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయక చవితి (Vinayaka Chavithi) పండుగకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ పర్వదినం సందర్భంగా ఇంటింటా గణనాథుడిని ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గణేశుడిని బుద్ధి, ఐశ్వర్యం, విజయాలకు అధిపతిగా భావిస్తారు. ఆయనను శ్రద్ధతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని ప్రజల విశ్వాసం. ఈ పండుగ అనంత చతుర్దశి వరకూ 10 రోజులపాటు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక రోజులలో పాటించాల్సిన ఆరు ముఖ్యమైన పూజా విధానాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీ జీవితంలో సంపద, శాంతి, విజయాలను తీసుకువస్తాయి.

మోదకం- లడ్డూ నైవేద్యం: గణపతికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం మోదకం- లడ్డూలు. ఈ నైవేద్యాన్ని భక్తితో సమర్పించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం.

21 దుర్వా గడ్డి-చ‌తేనె సమర్పణ: గణేశుడికి 21 దుర్వా గడ్డి కట్టలు- తేనె లేదా నెయ్యి సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి, అప్పుల నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

పసుపు రంగు గణేశుడి విగ్రహం: వినాయక చవితి నాడు కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించేవారు పసుపు రంగు విగ్రహాన్ని ఎంచుకోవడం శుభదాయకం. పసుపు రంగు పాజిటివ్ ఎనర్జీ, సంపదకు చిహ్నంగా భావిస్తారు.

Also Read: Chandrababu: రూ. 7,000తో రూ. 6,755 కోట్ల డైరీ సామ్రాజ్యాన్ని సీఎం చంద్రబాబు ఎలా నిర్మించారు?

ఏనుగుకు ఆహారం: వినాయకుడి వాహనమైన ఏనుగుకు ఆకులు లేదా ఆకుకూరలు తినిపించడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగి, చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.

గణేశ్ ఆలయంలో దర్శనం: వినాయక చవితి రోజున సమీపంలోని గణపతి దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఇది కుటుంబ ఐక్యతను పెంచి, ఆత్మబలాన్ని ఇస్తుంది.

మంత్రోచ్చరణ & ఉపవాసం: “ఓం గం గణపతయే నమః” వంటి మంత్రాలను జపించడం లేదా గణేశుడి 108 నామాలను చదవడం వలన మనసు కేంద్రీకృతమై, మనోకాంక్షలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.