Site icon HashtagU Telugu

Shani Dev Effect: శని దోషం ఉన్నవారు..ఇలా చేస్తే కాసుల వర్షమే.?

Shani Dev Effect

Shani Dev Effect

సాధారణంగా చాలామంది శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మరి కొంతమంది మాత్రం శని దేవుడి పేరు వింటేనే భయపడుతూ ఉంటారు. అయితే శనీశ్వరుని ఎవరైతే భక్తిశ్రద్ధలతో పూజించి శనీశ్వరుడికి ఇష్టమైన వస్తువులను దానం చేస్తారో వారికి శనీశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అయితే శని దోషం ఉన్నవారు ఆ దోషం పోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందుకోసం ప్రతి శనివారం శనీశ్వరుని తప్పక పూజించాలి.

ఇలా చేయడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. శని దేవునికి ఇష్టమైన రోజు శనివారం చీపురుతో ఇంటిని శుభ్రం చేసి పూజ చేసుకోవడం వల్ల మంచిది. శనివారం రోజు పని మీద బయటకు వెళ్ళినప్పుడు సన్యాసి లేదా పేదవాడు ఎదురైతే శుభసంకేతంగా పరిగణించవచ్చు. అలాగే ఇంట్లో నల్ల కుక్కని పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందట.

నల్ల కుక్కని శని దేవుని యొక్క వాహనంగా కూడా పిలుస్తారు. కాబట్టి శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల కుక్క ని ఇంట్లో పెంచుకోవడం చాలా మేలు. అంతేకాకుండా శనివారం రోజున ఉదయం నిద్ర లేచిన తర్వాత నల్ల కుక్కను చూడటం శుభప్రదంగా భావిస్తారు. అలాగే శనివారం రోజున బయటకు వెళ్లినప్పుడు నల్ల ఆవు కనిపిస్తే అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి అనే సంకేతం. ఆ నల్ల ఆవుకి ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా బలం చేపడుతుంది. అప్పటినుంచి కూడా అన్ని శుభవార్తలే వింటారట.

Exit mobile version