Astro: ఈ 3 వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి..!!

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 01:17 PM IST

ప్రపంచానికి ప్రాణశక్తి సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం మనపై లేనట్లయితే…అనారోగ్యాలపాలవుతాం. విశ్వాసాన్ని, ధైర్యాన్ని సూచిస్తాడు సూర్యుడు. చాలా మంది ఇవి లేకుంటే…అనారోగ్యాలు తప్పవు. మీరు ప్రతిరోజూ సూర్యుడికి నీరు లేదా ఆర్ఝ్యాన్ని సమర్పించాలి. ముఖ్యంగా ఈ మూడు రకాల వ్యాధులతో బాధపడేవారు సూర్యభగవానుడికి ఆర్ఝ్యం సమర్పించడం వల్ల ఉపశమాన్ని పొందవచ్చు.

1.. భయంతో ఉన్న వ్యక్తులు:
కొంతమంది ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. అలాంటి వారు ఒంటరిగా ఉన్నప్పుడే కాదు గుంపుగా ఉన్నప్పుడు కూడా భయపడుతుంటారు. అలాంటి వారు ప్రతిరోజూ సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించడం మంచిది. ఇది వారికి సానుకూల శక్తితో మానసిక శక్తిని ఇస్తుంది.

2. డిప్రెషన్:
ప్రతిరోజూ సూర్యభగవానుడికి ఆర్ఝ్యం సమర్పించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి కాంతి శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి సహాయపడతాయి. ఇది కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. డిప్రెషన్ తో బాధపడేవారికి అవసరమైన కొత్త ఆలోచనలను సృష్టించేలా చేస్తుంది.

3. గుండె సంబంధిత రోగులు:
అధిక రక్తపోటు అనేది ఒత్తిడితో మొదలవుతుంది. మానసికంగా, శారీరకంగా ఒత్తిడి నుంచి బయటపడాలంటే సూర్యభగవానుడికి అర్ఝ్యం సమర్పించాలి. గుండె సంబంధిత రోగులు ప్రతిరోజు కొంత సమయం సూర్యకాంతిలో గడిపేందుకు ప్రయత్నించాలి.

సూర్య భగవానుడికి సమర్పించడానికి మీరు ఉదయం 9 గంటలకు ముందే లేవాలి. సూర్యోదయ సమయంలో నీరు త్రాగుట మంచిది. ఒక రాగి పాత్రలో బియ్యం, చందనం, పువ్వులు తీసుకుని తూర్పు దిశలో గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇది మీ మనస్సు, ఆరోగ్యం రెండింటిపై ప్రభావం చూపుతుంది.