May Born People : మే నెల వచ్చేసింది. ఈ రోజు మేడే. ఈసందర్భంగా కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు. మే నెల అనగానే మనకు మండే ఎండలు, వడగాలులు గుర్తుకు వస్తాయి. ఇలాంటి టఫ్ వాతావరణ పరిస్థితుల నడుమ జన్మించిన వారు ఎలా ఉంటారు ? వారి వ్యక్తిత్వం, లక్షణాలు ఎలా ఉంటాయి ? జీవితంలో ఎలా వ్యవహరిస్తారు ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :ISI Chief Promotion : భారత్‌ను కాపీ కొట్టిన పాక్.. ఐఎస్ఐ చీఫ్‌కు ప్రమోషన్
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పుట్టిన నెలను బట్టి మనుషుల్లో తీరొక్క విధమైన లక్షణాలు ఉంటాయి. వారందరికీ భిన్నమైన వ్యక్తిత్వాలు ఉంటాయి. విభిన్న జీవన పరిస్థితులకు అనుగుణంగా స్పందించే తీరు కూడా భిన్నంగానే ఉంటుంది. ఈ తేడా ఏమిటో చూద్దాం..
జగమొండి
మే నెలలో మండే ఎండలు ఉంటాయి. సూర్యుడు జగమొండిలా నడి ఆకాశంలో నిలబడి నిప్పుల వర్షాన్ని కురిపిస్తుంటాడు. అందుకే ఈ నెలలో జన్మించే వారు జగమొండితనంతో ప్రవర్తిస్తారని అంటారు. ఈ మొండితనాన్ని కొందరు పాజిటివ్‌గా, ఇంకొందరు నెగెటివ్‌గా ఉపయోగిస్తుంటారు. కొందరు ఈ మొండితనాన్ని పట్టుదల, ఆత్మవిశ్వాసం రూపంలోకి మలుచుకుంటారు. ఇంకొందరు ఈ జగమొండితనాన్ని మూర్ఖత్వంగా మలుచుకుంటారు. మే నెలలో జన్మించిన వారు పాజిటివ్ ఆటిట్యూడ్‌ను అలవర్చుకుంటే సక్సెస్ సాధిస్తారు.
లక్ష్యమేవ జయతే
మే(May Born People) నెలలో జన్మించిన వారు తమ జీవిత లక్ష్యాన్ని ప్రేమిస్తారు. దాన్ని సాధించేందుకు బాగా శ్రమిస్తారు. మొండిగా ప్రయత్నాలు చేస్తారు. జీవిత లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా జీవనం గడుపుతారు.
తెలివిమంతులు
మే నెలలో పుట్టినవారు తెలివిమంతులు. అందుకే నిర్ణయాలను తొందరపాటుతో తీసుకోరు. బాగా ఆలోచిస్తారు. ఇతరుల సలహాలను తీసుకుంటారు. నిపుణులను సంప్రదిస్తారు. సమస్యల్లోనూ దారులను వెతికి పట్టుకోవడం వీరికి ప్రత్యేకత.
Also Read :Electronic Warfare : పాక్ వాయుసేనకు చుక్కలే.. రంగంలోకి భారత ఎలక్ట్రానిక్ వార్ఫేర్
నమ్మకస్తులు
మే నెలలో జన్మించిన వారిలో చాలామంది సూర్యుడిలా సత్యవంతులు. సూర్యుడి ప్రకాశం ఎంత నిజమో.. మే నెలలో జన్మించిన వారి మాటలు అంతే నిజంగా ఉంటాయి. అందుకే వారిని అందరూ త్వరగా నమ్ముతారు. నమ్మకస్తులుగా, విధేయులుగా వీరు పేరు తెచ్చుకుంటారు. వివిధ రంగాలలో వీరిని నమ్ముకొని పెద్దపెద్ద టీమ్‌లు నడుస్తాయి. పెద్దపెద్ద ప్లాన్స్ అమలవుతాయి.
మిస్టర్ కనెక్ట్
మే నెలలో జన్మించిన వారు ఇతరులతో ఈజీగా కనెక్ట్ అవుతారు. దీనికి కారణం వీరి కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రతీ విషయంలో వీరికి క్లారిటీ ఉంటుంది. ఏ విషయంపై అయినా సరే క్లారిటీకి వచ్చాకే వీరు మాట్లాడుతారు. ఇతరుల కష్టాల్లో పాలుపంచుకుంటారు. ఇతరుల బాధలను అర్థం చేసుకుంటారు.
క్రియేటివ్
మే నెలలో జన్మించిన వారు క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. ప్రతీ విషయాన్ని భిన్నమైన కోణంలో చూసే ప్రయత్నం చేస్తారు. అందుకే వీరు కళారంగంలో అవలీలగా రాణిస్తారు. చిత్రలేఖనం, రచనలు, సంగీతం వంటి విభాగాల్లో సత్తా చాటుతారు.
సాహసికులు
మే నెలలో జన్మించిన వారు అవసరమైన సందర్భాల్లో సాహసాలు చేసేందుకు వెనుకాడరు. తాము పనిచేసే రంగాల్లో ఎవరూ ఊహించనంత పనితీరును కనబర్చగలరు. దూర ప్రయాణాలు చేయడమన్నా.. కొత్త ప్రదేశాలను చూడటమన్నా వీరికి ఇష్టం.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.