Peepal tree: ఇంట్లో రావి చెట్టు ఉండకూడదా.. రావి చెట్టు నీడ ఇంటిపై పడితే ఏమవుతుందో తెలుసా?

హిందువులు రావి చెట్టుని పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అందుకే క్రమం తప్పకుండా రావి చెట్టుకి పూజలు కూడా చేస్తూ ఉంట

  • Written By:
  • Publish Date - December 19, 2023 / 07:30 PM IST

హిందువులు రావి చెట్టుని పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అందుకే క్రమం తప్పకుండా రావి చెట్టుకి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శనివారం రోజు రావి చెట్టుకు నీళ్లు సమర్పించి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగ శాతం రావి చెట్లు మనకు దేవాలయాల వద్ద మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇండ్ల దగ్గర ఇంటి సమీపంలో రావి చెట్లు చాలా తక్కువగా మాత్రమే ఉంటాయి. అయితే మరి రావి చెట్లు ఇంటిదగ్గర ఉండవచ్చా? రావి చెట్టు మీద ఇంటిపై పడవచ్చు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రావి చెట్టుపై సకల దేవతలు నివసిస్తారని ప్రతీతి. అయితే రావి చెట్టును పవిత్రంగా భావించి 24 గంటల పాటు ఆక్సిజన్ అందజేస్తున్నప్పటికీ, ప్రజలు తమ ఇంట్లో, పెరట్లో దీనిని నాటరు. రావి మొక్క కొన్ని సంవత్సరాలలో పెద్ద వృక్షంగా ఎదుగుతుందని, దాని వేర్లు చాలా దూరం వ్యాపిస్తాయి. ఇంట్లో ఈ చెట్టు పెరిగితే, దాని వేర్లు ఇంటి పునాదిని బలహీనపరుస్తాయి. ఇది ఇంటి పునాదిని కదిలించగలదు. అందుకే ఈ చెట్టును ఇంట్లో నాటకూడదనే ప్రధాన కారణాలలో ఇది ఒకటి. అయితే ఈ రోజుల్లో ప్రజలు తమ ఇళ్లలో బోన్సాయ్ రావి మొక్కలను పెంచ‌డం ప్రారంభించారు. అయితే రావి చెట్టు 24 గంటల పాటు ఆక్సిజన్‌ను నిరంతరం అందిస్తుంది.

అందువలన, శరీరం అదనపు ఆక్సిజన్ పొందినప్పటికీ, అది మానవ శరీరానికి హానికరం అని నిరూపిత‌మైంది. ఈ కారణంగా ప్రజలు తమ ఇంట్లో రావి చెట్లను ఎద‌గ‌నీయ‌రు. ఇంట్లో రావి చెట్టు నాటడం సాధ్యం కాదు. పైగా రావి చెట్టు స్వేచ్ఛ‌గా పెరగడానికి అనుమతించాలని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, దానిని ఇంట్లో నాటితే, దాని వేర్లు ప్రతిచోటా వ్యాపించి, ఇంటి పునాదిని బలహీనపరిచే అవకాశం ఉంది. వాస్తు ప్రకారం, రావి చెట్టు నీడ ఒక నిర్దిష్ట దిశ నుంచి ఇంటిపై పడితే ఆ కుటుంబ‌స‌భ్యుల్లో అభిప్రాయ బేధాలు కలుగుతాయి. అందువ‌ల్ల‌ కుటుంబ పురోగతికి అడ్డంకులు సృష్టించవచ్చు. రావి చెట్టు నీడ మనసులో ప్రతికూల ప్రకంపనలు సృష్టిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రావి చెట్టు నీడ ఇంటిపై పడితే అది హానికరమని నమ్ముతారు. ఇది ఆ ఇంటి కుటుంబ సభ్యుల పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తారు.