Vastu Tips: మీ ఇంట్లో రావి చెట్టు పెరిగిందా.. అయితే వెంటనే ఇలా చేయండి?

హిందువులు రావి చెట్టుని పరమ పవిత్రంగా భావించడంతో పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఈ రావి చెట్టులో బ్రహ్మ విష్ణువు శివుడు నివసిస్తార

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 10:18 PM IST

హిందువులు రావి చెట్టుని పరమ పవిత్రంగా భావించడంతో పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఈ రావి చెట్టులో బ్రహ్మ విష్ణువు శివుడు నివసిస్తారని నమ్మకం. రావి చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది. నేల మీద మాత్రమే కాదు ఇంటి గోడలు, పైకప్పులో కూడా పెరుగుతుంది. ఆ చెట్టుని ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇంట్లో రావి చెట్టు పెరగడం వాస్తు ప్రకారం అశుభం. రావి చెట్టులో దేవతలు నివసిస్తారని నమ్మకంతో ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రావి చెట్టు ఉండటం సరైనది కాదు. ఇంట్లో ఈ చెట్టును పెంచడం అశుభం.

కనుక ఇంట్లో ఈ చెట్టు పెరుగుతుంటే వెంటనే దానిని తొలగించాలి. సాధారణంగా రావి చెట్టు ఇంటి పైకప్పుపై లేదా గోడకు మద్దతుగా పెరుగుతుంది. ఈ చెట్టుని ఎన్ని సార్లు తీసినా పదే పదే పెరుగుతూ ఉంటే ఈ సింపుల్ టిప్స్ ని పాటించండి. కొంచెం పెరిగిన తర్వాత ఆ చెట్టుని మట్టితో సమానంగా అక్కడ నుంచి తొలగించి దానిని వేరే ప్రాంతంలో , దేవాలయంలో లేదా రోడ్డు పక్కన నాటడం మంచిది.
ఇంట్లో రావి చెట్టు ఉండటం వల్ల ఇంటి సభ్యులకు పురోగతి ఉండదు. ప్రతిరోజూ కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అయితే ఈ చెట్టును నరికివేయకూడదు. అలా చేయడం అశుభం. దానిని తవ్వి వేరే ప్రాంతంలో నాటాలి.

ఒకవేళ తప్పని సరి పరిస్థితుల్లో రావి చెట్టుని నరకాల్సి వస్తే. పూజ అనంతరం ఆదివారం రోజున మాత్రమే కట్‌ చేయాలి. మీ ఇంట్లో రావి చెట్టు తరచుగా పెరుగుతూ ఉంటే45 రోజుల పాటు ఆ చెట్టును పూజించి పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించాలి. 45 రోజుల తర్వాత రావి మొక్కను దాని మూలాలతో తీసి మరొక ప్రదేశంలో నాటాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు ఉండవు.