HYD: పెద్దమ్మ తల్లి 30వ వార్షికోత్సవ వేడుకలు షురూ, అమ్మవారి ఆలయం ముస్తాబు

  • Written By:
  • Publish Date - February 14, 2024 / 11:15 PM IST

HYD: పెద్దమ్మ తల్లి 30వ వార్షికోత్సవ వేడుకలకు అమ్మవారి ఆలయం ముస్తాబవుతున్నది. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు అమ్మవారి రథోత్సవ వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అమ్మవారి విగ్రహం అదే రోజున ప్రతిష్ఠాపన జరిగింది. దీంతో ప్రతిఏటా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు.

బుధవారం ఉదయం 3 గంటలకు పెద్దమ్మ తల్లికి అభిషేకం నిర్వహిస్తారు. గురువారం మండల పూజలు, వేదపారాయణం, శుక్రవారం రథోత్సవం, శనివారం అమ్మవారి ఉత్సవ మూర్తికి పుష్కరిణిలో స్నానంతో వార్షికోత్సవాలు ముగుస్తాయి. హంపీ పీఠాధిపతులు విద్యారణ్యస్వామి చేతుల మీదుగా విమాన శిఖర కుంభాభిషేకం నిర్వహిస్తారు. కొంగు బంగారమై భక్తులకు వరాలిచ్చే తల్లిగా పేరుపొందిన పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడతారు.

ఆలయం పేరువినగానే ముందుగా గుర్తుకొచ్చేది కాంగ్రెస్ మాజీ సీఎల్పీ లీడర్ దివంగత పీజేఆర్. చిన్నగా ఉన్న పెద్దమ్మ ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. ఇప్పుడు నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.