Site icon HashtagU Telugu

Ayodhya : అయోధ్య రాముడికి హైదరాబాద్ ముత్యాల హారం

Pearl Necklace

Pearl Necklace

మరికొద్ది గంటల్లో అయోధ్య లో రామమందిరం ప్రారంభోత్సవం జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు కోట్లాది ప్రజలు , భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటీకే ఈ రామ మందిర ప్రారంభ కార్యక్రమాలన్నీ దాదాపు పూర్తి అయ్యాయి. రాముడి విగ్రహం ఎంత బాగుందో.. రామమందిరం ఎంత చూడముచ్చటగా ఉందో అంటూ ఎన్నో విషయాల గురించి చర్చ జరుగుతుంది. శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండే అయోధ్య రాముడి కోసం హైదరాబాద్ నుండి ముత్యాల హారం వెళ్లనుంది. ఈ ముత్యాల హారాన్ని తొమ్మిది మంది కళాకారులు తొమ్మిదిరోజులు కష్టపడి తయారు చేశారు. ఈ హారం తయారు చేయడానికి ముంబై నుంచి ముత్యాలను తెప్పించారు. మూడు కిలోల 600 గ్రాముల ముత్యాలు, అరకిలో పచ్చల మణులతో ఈ హారం ప్రవళ జ్యువెలర్స్‌ అండ్‌ జేమ్స్‌ వారు తయారు చేశారు. ఈ హారంలో అరకిలో పచ్చల మణలు కూడా ఉపయోగించారు. అలాగే అయోధ్య రాముడికిఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కానుకలు భారీగా వెళ్తున్నాయి. తిరుపతి నుంచి శ్రీవారి లడ్డూలు పంపుతుండగా.. ఇప్పటికే సిరిసిల్ల నుంచి స్వామి వారికి బంగారు చీరను పంపుతున్నారు.సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్‌ ఈ బంగారు చీరను తయారు చేశారు. రామాయణ ఇతివృత్తాన్ని వర్ణించే చిత్రాలతో చీరను తయారు చేశారు.

అలాగే అయోధ్యను అలంకరించేందుకు కాశీ నుంచి కూడా పూలు తెప్పించారు.పూర్వాంచల్‌లోని అతిపెద్ద పండ్ల మార్కెట్‌ నుంచి 50 క్వింటాళ్ల పూలను రెండు రోజుల క్రితం అయోధ్యకు తరలించారు. ఈ పూలలో ఆరెంజ్‌, పసుపు రంగు బంతిపూలు ఉన్నాయి. ఇదేవిధంగా కాశీ నుంచి అయోధ్యకు పెద్ద మొత్తంలో గులాబీలను పంపించామని, పది వేల బంతిపూల దండలను కూడా పంపినట్లు మాల్దాహియా పూల మార్కెట్ హెడ్ విశాల్ దూబే తెలిపారు. ఇలా మొత్తం మీద దేశ వ్యాప్తంగా అన్ని చోట్లా నుండి అనేక వైనవి అయోధ్య కు పంపించారు.

Read Also : Fruit vs Fruit Juice: పండ్లు తిన‌డం మంచిదా..? జ్యూస్ తాగితే మంచిదా..? నిపుణులు ఏం అంటున్నారో తెలుసా..?