Peacock: కలలో నెమలి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

భారతదేశంలో నెమలికి ఉన్న ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసిందే. ఆధ్యాత్మికంగా కూడా నెమలికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెమలి కార్తికేయుడి వాహనం అన్న

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 05:20 PM IST

భారతదేశంలో నెమలికి ఉన్న ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసిందే. ఆధ్యాత్మికంగా కూడా నెమలికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెమలి కార్తికేయుడి వాహనం అన్న విషయం తెలిసిందే. అయితే నెమలి తెల్లవారుజామున అకస్మాత్తుగా నెమలి మీ ఇంటికి వస్తే అదృష్టం మీ వెంటే ఉన్నట్టు. దీనితో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అదృష్టం కూడా పెరుగుతుంది. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరుగుతున్నాయి అనడానికి ఇది సంకేతంగా భావించాలి. అయితే ఒకవేళ కలలో నెమలి కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీ కలలో నెమలి కనిపిస్తే, అది ఖచ్చితంగా శుభసూచకంగా భావించాలి. శాస్త్రాల ప్రకారం కలలో నెమలిని చూడటం శుభప్రదంగా భావించాలి. ఒకవేళ కలలో పాము, నెమలి పోట్లాటను చూస్తున్నట్లయితే అలాంటి కలలు మీకు మంచి సంకేతం. అంటే ఇక మీదట. మీకు శత్రువులు తగ్గుతారు, వారు మీపై పన్నిన కుట్ర విఫలం అవుతుంది. అలాగే కలలో శనిదేవుడు నెమలితో కనిపిస్తే అలాంటి కల రావడం అరుదు. కానీ అలాంటి వస్తే మాత్రం అధ్భుతమే అని చెప్పవచ్చు.

అలాగే కలలో తెల్లని నెమలి కనిపిస్తే ధనవంతులవుతారు. త్వరలోనే డబ్బు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయని అర్థం. అలాగే బెడ్‌ రూమ్‌లో నెమలి పింఛాన్ని కంటికి కనిపించేటట్టుగా పెట్టి తెల్లవారు జామున లేవగానే దానిని చూడటం వల్ల రాహుగ్రహ దోషాల నుంచి నివారణ కలుగుతుంది. నెమలి పించంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి.నెమలి శరీరం నుంచి నేలరాలే నెమలి పించాలను తీసుకొచ్చి ఇంట్లోని పూజగదిలో ఉంచితే వాస్తుదోషాలు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెమలి పించం పెడితే ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గిపోతుంది. నెమలి పించంతో పాటూ పూజగదిలో వినాయకుడికి ప్రీతికరమైన గరిక, విష్ణుమూర్తికి ఇష్టమైన తులసీ దళాలను వుంచడం ద్వారా వాస్తు దోషాలను తొలగించుకోవచ్చు.