జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సనాతన ధర్మ ( Sanatana Dharma) పరిరక్షణకు తలపెట్టిన పర్యటనకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ వివిధ ఆలయాలను సందర్శించనున్నారు. అనంతపద్మనాభ స్వామి ఆలయం, మధుర మీనాక్షి ఆలయం, శ్రీ పరుసరామస్వామి ఆలయం, అగస్థ్య జీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించనున్నారు.
ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పద మైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కల్యాణ్ నేరుగా తమిళనాడులో పర్యటించి సనాతన ధర్మంపై తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తపరచబోతున్నారు. ఈ టూర్ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారే అవకాశం ఉంది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ప్రధాన రాజకీయ శక్తులుగా ఉన్నప్పటికీ బీజేపీ కూడా తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. పవన్ కల్యాణ్ పర్యటన వల్ల సనాతన ధర్మ పరిరక్షణపై ప్రజల్లో చర్చ జరుగుతుందని, అది రాజకీయంగా కొత్త మార్గాన్ని తెరిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.