Chilkur Balaji : రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్

Chilkur Balaji : ఇది దురదృష్టకరమని, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని చెప్పారు. దాడి వెనుక కారణాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Condemns The A

Pawan Kalyan Condemns The A

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఖండించారు. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు(Chilkur Balaji Temple’s Chief Priest ) సీఎస్ రంగరాజన్‌ (C.S. Rangarajan)పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రంగరాజన్ తన ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు అనుమతిలేకుండా లోపలికి చొరబడి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని ఆయనను బెదిరించారు. అయితే దీనికి ఆయన నిరాకరించడంతో దుండగులు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రంగరాజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా..రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసారు.

ఈ ఘటనపై ఏపీ అర్చక సమాఖ్య తీవ్రంగా స్పందించింది. అర్చకులపై దాడిని ఖండిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసుల స్వామి దేవాలయాల్లో పూజారుల భద్రతపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇది దురదృష్టకరమని, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని చెప్పారు. దాడి వెనుక కారణాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తనకు రంగరాజన్ అనేక సూచనలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను పరామర్శించాలని తెలంగాణ జనసేన నేతలకు పవన్ సూచించారు.

అలాగే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం సోమవారం ఉదయం స్వయంగా రంగరాజన్ వద్దకు వెళ్లి పరామర్శించి , దాడికి సంబదించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

  Last Updated: 10 Feb 2025, 03:09 PM IST