Site icon HashtagU Telugu

Parijata Flowers: పూజ కోసం పారిజాత పూలు కోయకూడదు తీసుకోకూడదు.. కారణం ఏంటో తెలుసా?

Parijata Flowers

Parijata Flowers

పారిజాత పుష్పాలు.. నీ పేరు వినగానే దేవతలు రాక్షసులు అమృత కోసం క్షీరసాగర మతనం చేస్తున్న ఘట్టం గుర్తుకు వస్తుంది. ఆ క్షీరసాగర మతనం చేస్తున్నప్పుడు ఉద్భవించిన పారిజాత వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ పూల పరిమళం స్వర్గలోకం మొత్త విరజిమ్మేదట. ద్వాపర యుగంలో సత్యభామ కోరిక మేరకు ఈ వృక్షాన్ని కృష్ణుడు భూలోకానికి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. స్వర్గం నుంచి తీసుకురావడం వల్ల పారిజాత వృక్షాన్ని దేవతా వృక్షం అంటారు. పారిజాత పుష్పాన్ని చూడడానికి ఎంతో ముద్దుగా అందంగా కనిపిస్తాయి. అయితే ఈ పూలు ఎరుపు, తెలుపు, పసుపు, నీలి రంగు, గులాబీ రంగు సహా మొత్తం తొమ్మిది రంగుల్లో ఉంటాయి.

ఇందులో ఎరుపు రంగు పారిజాతంతో విష్ణుమూర్తిని పూజచేయకూడదని చెబుతారు. కాగా మామూలుగా దేవుళ్లకు పూజ చేసే పూలను బయట మార్కెట్ లో కొనుగోలు చేయడం లేదంటే ఇంటి ఆవరణలో చెట్లు ఉంటే కోసుకొచ్చి పూజ చేస్తూ ఉంటాం. నేలరాలినవి తీసుకోం. చెట్టునుంచి కోసుకున్నపూలనే తీసుకొచ్చి భగవంతుడిని పూజిస్తాం. కానీ పారిజాత పూలు మాత్రం ఎప్పుడూ చెట్టునుంచి కోయరాదు. నేల రాలిన పూలనే పూజకు వినియోగించాలి. మిగిలిన పూలకు, పారిజాత పూలకు వ్యత్యాసం ఏంటంటే మిగిలిన పూలన్నీ భూమ్మీద పుట్టినవే. కానీ పారిజాత చెట్టు మాత్రం స్వర్గం నుంచి తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు.

అందుకే ఈ దేవతా వృక్షం నుంచి పూలు కిందకు పడినప్పుడే అవి భూమికి సొంతమవుతాయట. అప్పుడు వాటిని తీసుకోవాలి కానీ చెట్టునుంచి కోసుకోరాదు. అందుకే పారిజాత వృక్షం కింద ఎప్పుడూ ఆవుపేడతో కళ్లాపి చల్లి ఉంచాలి. అప్పుడు నేల రాలిన పూలను తీసుకోవాలంటారు. మరో ముఖ్య విషయం ఏంటంటే వీటిని ఎవరి వద్ద నుంచీ తీసుకోకూడదు. ఎందుకంటే పూలు ఇచ్చిన వారికే మీ పూజాఫలం వెళ్లిపోతుంది. కాబట్టి ఈ విష్ణుమూర్తికి పూజ చేయాలి అనుకున్న వారు కేవలం కింద పడిన పారిజాత పుష్పాలతో మాత్రమే పూజ చేయాలి. అలాగే ఎదుటివారి నుంచి తీసుకున్న పుష్పాలతో పూజ చేయరాదు.