Tirumala: ఘనంగా ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం!

తిరుమల లో మూడు రోజుల పాటు జరిగిన, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం ఘనంగా ముగిసింది.

  • Written By:
  • Publish Date - May 13, 2022 / 05:19 PM IST

తిరుమల లో మూడు రోజుల పాటు జరిగిన, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం ఘనంగా ముగిసింది. సాయంత్రం  శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేశారు. ముందు రెండురోజుల లాగే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది.  ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు. హారతి అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. ఈ ఉత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.