Mumbai Ganesh Immersion: గణేష్ ఉత్సవాలు ముగిశాయి. 11 రోజుల ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. వేలాది గణనాథులు గంగమ్మ తల్లి ఒడికి చేరాయి. గణేష్ ఉత్సవాలను ముంబైలో ఘనంగా జరుపుతారు. కాగా గురువారం రాత్రి 9 గంటల నాటికి ముంబైలో మొత్తం 20,000 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల సమయానికి, 20,195 విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఇందులో 18,772 గృహాల నుంచి వచ్చినవి అయితే, 1,019 విగ్రహాలు బహిరంగ ప్రదేశాల్లో ప్రతిష్టించినవి, అలాగే 304 గౌరీ దేవి విగ్రహాలు ఉన్నాయని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు.మహానగరం అంతటా నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పోలీసులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 19న ‘గణేష్ చతుర్థి’తో ప్రారంభమైన ఈ ఉత్సవం గురువారం ‘అనంత చతుర్దశి’ రోజున నిమజ్జనంతో ముగుసింది.
Also Read: TDP : చంద్రబాబు అరెస్ట్ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం