Tijori Vastu : డబ్బుల పెట్టెను ఇంట్లో ఆ దిక్కులో ఉంచితే.. అది పోవడమే కాదు.. అనేక సమస్యలూ వస్తాయని వాస్తు పండితులు అంటున్నారు.
డబ్బును సరైన ముహూర్తంలో, సరైన దిశలో ఉంచితే డబ్బు రాక అనేక రెట్లు పెరుగుతుందని చెబుతున్నారు.
లక్ష్మీదేవి అనుగ్రహం లభించే ఆ చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మనం ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తాం. ఆ డబ్బును ఒక పెట్టెలో ఉంచుతాం. వాస్తు శాస్త్రంలో డబ్బును నిల్వ ఉంచే చిట్కాలు కూడా ఉన్నాయి. దాని ప్రకారం గల్లా పెట్టె వెనుక భాగం దక్షిణం వైపు ఉండేలా, తలుపు భాగం ఉత్తరం వైపు తెరుచుకునేలా ఉంచండి. ఆగ్నేయ మూలలో గల్లా పెట్టె ఉంటే.. డబ్బు అనవసరంగా ఖర్చవుతుంది. ఉత్తర దిక్కును కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిశ నుంచే డబ్బు వస్తుంది. అందుకే డబ్బు సంబంధిత పనులు చేయడానికి ఈ దిశ ఉత్తమంగా పరిగణించబడుతుంది. అందుకే గల్లా పెట్టె డోర్‌ను ఉత్తరం వైపు ఉంచాలి. గల్లా పెట్టె (Tijori Vastu) ఎట్టి పరిస్థితుల్లో దక్షిణంవైపు తెరవకూడదు. అటువైపున యుముడు ఉంటాడు. ఆయన వైపున లాకర్ తెరిస్తే… కష్టాలను ఆహ్వానించినట్లే. ఉన్నది పోవడమే కాదు… అప్పులు తప్పవు.
ఖజానా గది ఇలా ఉండాలి
గల్లా పెట్టె ఉంచిన గదిలో కూడా వాస్తు నియమాలు పాటించాలి. గల్లా పెట్టె గది తలుపులు తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి. ఈ గది దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి. ఈ గదికి ఒకే ప్రవేశ ద్వారం ఉండాలని గుర్తుంచుకోండి. గల్లా పెట్టె గదికి డబుల్ వింగ్స్ తలుపులు ఉంటే శుభప్రదంగా పరిగణిస్తారు.
Also read : Gaja Lakshmi Raja Yogam: హోలీ తర్వాత గజలక్ష్మి రాజయోగం.. ఈ రాశుల వారికి శని దోషం వీడుతుంది
గల్లా పెట్టెలో ఇవి ఉంచకూడదు
వీలైనంత వరకు బట్టలు, పాత్రలు, ఫైళ్లు మొదలైన వాటిని గల్లా పెట్టెలో ఉంచకూడదు. గల్లా పెట్టె ముందు దేవుని చిత్రపటాన్ని ఉంచకూడదు. డబ్బు కట్టలపై బరువులు పెట్టొద్దు. స్ప్రే, అగరబత్తీలు మొదలైన సువాసన గల వస్తువులను కూడా గల్లా పెట్టెలో ఉంచకూడదు.
డబ్బు నీళ్లలా ఖర్చవుతుంటే ఇలా చేయండి
కొంత మంది డబ్బు సంపాదిస్తారు, కానీ డబ్బు అంతా నీళ్లలా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి వారు సోమవారం నాడు.. ఐదు శంఖ పుష్పాలను తీసుకుని, వాటిని నదిలో కలపండి. ఇలా చేయడం వలన ఆర్ధిక ఇబ్బందుల సమస్య తీరుతుంది. డబ్బు కొరత ఉండదు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉంటే.. మంగళవారం నాడు, హనుమంతుని పాదాల వద్ద అపరాజిత పుష్పాన్ని సమర్పించండి. పూజ చేసిన తరువాత.. ఈ పువ్వును తీసుకొని గల్లా పెట్టెలో లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు తీరతాయి.
గమనిక : ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.