Happy Onam : పాతాళం నుంచి భూమిపైకి రావయ్యా.. బలి చక్రవర్తిని ఆహ్వానించే ప్రత్యేక వేడుక

Happy Onam :  ఇవాళ ఓనం పండుగ. ఇది మనదేశ జాతీయ పండుగల్లో ఒకటి. 

  • Written By:
  • Updated On - August 29, 2023 / 11:22 AM IST

Happy Onam :  ఇవాళ ఓనం పండుగ. 

ఇది మనదేశ జాతీయ పండుగల్లో ఒకటి. 

కేరళ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఫెస్టివల్ కు 1961 లో  నేషనల్ ఫెస్టివల్ గా గుర్తింపు లభించింది.

ఓనమ్ పండుగ వేడుకలు ఏటా 10 రోజులు జరుగుతాయి.

ఈసారి ఆగస్టు 20న మొదలైన వేడుకలు ఇవాళ (ఆగస్టు 29న) ముగుస్తున్నాయి.

ఈ ఫెస్టివల్ లో మొదటి రోజును ‘అతమ్’.. చివరి రోజు(ఆగస్టు 29)ను ‘తిరు ఓనమ్’ అని పిలుస్తారు.

Also read : Bhagavata – Miracle : భాగవత ప్రవచనం విన్న దొంగ.. యమునా తీరానికి వెళ్తే ఏమైందంటే..?

ఓనం పండుగ చరిత్ర..

దాన గుణంలో బలిచక్రవర్తిని మించినవారు లేరు. శ్రీ మహావిష్ణువు మహా భక్తుడైన ప్రహ్లాదుడి మనవడే బలిచక్రవర్తి. ఈయనతోనే ఓనం పండుగకు సంబంధం ఉంది. ఇంద్రాది దేవతలను బలిచక్రవర్తి ఇబ్బందిపెడుతున్న టైంలో విష్ణుమూర్తి  వామనుడి అవతావరంలో భూమిపైకి వస్తాడు. లౌక్యంగా మూడడుగుల  జాగ అడిగి.. ఇస్తానని చెప్పగానే..  బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేస్తాడు.అయితే బలి చక్రవర్తి దాన గుణానికి సంతోషించిన మహావిష్ణువు ఏటా కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేలా వరమిస్తాడు. అందుకే బలి చక్రవర్తిని భూమి మీదకు ఆహ్వానిస్తూ కేరళలో 10 రోజుల పాటు ఓనం పండుగ జరుపుకుంటారు.బలి చక్రవర్తిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు రంగురంగుల పూలతో రంగవల్లులు తీర్చిదిద్దుతారు.  మహాబలి పాలించిన సమయం మళయాలీలకు స్వర్ణ యుగంతో సమానం.  బలిచక్రవర్తి పాలనలో కేరళ రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లారని చెబుతారు. అందుకే రాక్షస రాజు అయినప్పటికీ బలిచక్రవర్తిని గౌరవిస్తారు. ఇదే వేడుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతి పేరుతో నిర్వహిస్తారు. కేరళలో ఓనం పండుగ (Happy Onam) అనగానే గుర్తుకొచ్చేది తెల్లని బంగారువర్ణం బార్డర్ శారీ. మహిళలు తెల్లటి చీరలు, దుస్తులు, బంగారు ఆభరణాలను ధరిస్తారు.  పూలతో అలంకరించిన రంగోలి చుట్టూ సంప్రదాయ నృత్యాలు చేస్తారు. సాంప్రదాయ జానపద నృత్యాలను ప్రదర్శిస్తారు.

Also read : NTR Coin – Buy Now : ‘ఎన్టీఆర్ కాయిన్’ సేల్స్ నేటి నుంచే.. ఇలా కొనేయండి

గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.