Site icon HashtagU Telugu

Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

Diwali

Diwali

Diwali: దీపాల పండుగగా పిలువబడే దీపావళిని (Diwali) ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్షం అమావాస్య రోజున జరుపుకుంటారు. 2025వ సంవత్సరంలో దీపావళి పండుగ అక్టోబర్ 21 మంగళవారం నాడు వచ్చింది. అయితే కొన్ని పంచాంగాల ప్రకారం అక్టోబర్ 20న కూడా జరుపుకోవచ్చు. సాధారణంగా కార్తీక అమావాస్య తిథి అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21న సాయంత్రం 5:55 గంటలకు ముగుస్తుంది. అయితే లక్ష్మీ పూజ ప్రదోష కాలంలో స్థిర లగ్నంలో (వృషభ లగ్నం) చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం

2025లో దీపావళి రోజున లక్ష్మీ పూజ చేయడానికి అత్యంత శుభప్రదమైన సమయం సాయంత్రం 7:08 నుండి 8:18 వరకు (ముహూర్తం సమయం సుమారు 1 గంట 10 నిమిషాలు) అని పండితులు చెబుతున్నారు. ప్రదోష కాలం (సూర్యాస్తమయం తరువాత మొదటి 2 గంటల 24 నిమిషాలు) త‌ర్వాత అమావాస్య తిథి ఈ సమయంలో కలవడం అత్యంత శుభప్రదమ‌ని పండితులు చెబుతున్నారు.

Also Read: Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

దీపావళి లక్ష్మీ పూజ విధానం

దీపావళి రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవి, గణేశుడిని పూజించడం వలన ఇంట్లో సిరిసంపదలు, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. పూజ చేయు విధానం స్థలాన్ని బట్టి కొద్దిగా మారినప్పటికీ ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.

పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు వేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులు, పసుపు, కుంకుమ, చందనం సిద్ధం చేసుకోవాలి. ఈశాన్య దిశలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి, దానిపై ఎరుపు వస్త్రాన్ని పరచి లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలను లేదా చిత్రాలను ఉంచాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ఇంటి బయట కూడా దీపాలు వెలిగించి, ధనాకర్షణ కోసం ‘యమ దీపం’ పెట్టడం శుభప్రదం. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం, కనకధారా స్తోత్రం వంటి వాటిని పఠించడం శ్రేయస్కరం. పేలాలు, బెల్లం, లడ్డూలు, పాయసం, ఇతర పండుగ వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. చివరగా హారతి ఇచ్చి, కుటుంబ సభ్యులందరూ లక్ష్మీదేవిని ప్రార్థించి, ఆశీస్సులు తీసుకోవాలి.

Exit mobile version