Navratri: దేవీ నవరాత్రులలో ఏడవ రోజు, లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు

దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - October 21, 2023 / 01:35 PM IST

Navratri: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు, ఆశ్వయుజ శుద్ధ సప్తమి, మణిద్వి నివాసి అయిన పరాంబిక శనివారం నాడు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో పూజించబడుతుంది. ఈ తల్లి త్రిపురత్రయంలో రెండవ శక్తి రూపం. అందుకే శరన్నవరాత్రులలో వచ్చే పంచమిని లలితా పంచమి అని కూడా అంటారు.

బెత్తం, విల్లు, ధనుస్సు, అంకుశం ధరించి దేవి లక్ష్మీ, సరస్వతి సమేతంగా కుడి, ఎడమల సేవలు నిర్వహిస్తుండగా శ్రీ లలితా పరాభట్టారిక భక్తురాలు ఆటంకాలు తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శ్రీ లలితాదేవి అలంకారంలో అమ్మవారిని సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమతో పూజించి ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తారు. ముత్తైదువులను పిలిచి సువాసిని పూజలు నిర్వహిస్తారు. కైలాస గౌరీ నోము కానీ, గ్రామ కుంకుమ నోము కానీ నోచుకున్న వారు చాలామంది ఈరోజు ఉద్యాపన చేస్తారు.

మరికొందరు తమ ఇళ్లలో సామూహిక లక్ష కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారన్నారు. బొమ్మలకొలువులు పెట్టుకున్నవారు పేరంటాలు చేసుకుంటారు. శ్రీ లలితా దేవి తనను ఆరాధించే భక్తుల పేదరికాన్ని, దుఃఖాలను నాశనం చేస్తుంది. కుంకుమ పూజ చేసిన వారికి అమ్మవారు మాంగల్యం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీలలితా దేవిని మనస్ఫూర్తిగా తలచుకుంటూ పంచమినాడు వీలైనన్ని సార్లు ఓం ఐం హ్రీం, శ్రీ శ్రీ మాత్రే నమః అని జపిస్తే అమ్మ మాతృమూర్తియై చల్లగా చూస్తారని భక్తుల నమ్మకం.