Shivaratri: మహా శివరాత్రి సందర్భంగా శివ రూపం, శివరాత్రి ధర్మసందేహాలు..

మనిషి భూమి (Earth) మీదకు వస్తూ తెచ్చిందేమీ లేదు. పోయేటప్పుడు తీసికొని పోయేదేమీ లేదు.

🌺భస్మధారణం ఏం చెపుతుంది?

మనిషి భూమి మీదకు వస్తూ తెచ్చిందేమీ లేదు. పోయేటప్పుడు తీసికొని పోయేదేమీ లేదు. పుట్టుక మరణం మధ్య జీవితం ఒక నాటకం. చివరకు మానవుడు రూపాంతరం చెందేది ‘భస్మంగాన నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము’ అన్నాడు గదా అన్నమయ్య. స్వార్థ రహితంగా, త్యాగబుద్ధితో నలుగురికీ ఉపయోగపడే మంచి పనులు చేస్తూ, బతికినంత కాలం మంచిగా జీవించి ఆదర్శంగా ఉండమని చెప్తోంది.

🌺శ్మశాన వాసిత్వం ఎందుకు?

ఎంతటి వారైనా ఏదో ఒక రోజు శ్మశానానికి చేరవలసిందే. తనతో వచ్చిన వారందరూ వెళ్లగా దుఃఖిస్తుంది సూక్ష్మప్రాణి. ఒంటరి అయిన నీకు ఈ శ్మశానంలో నేనున్నానని అభయాన్నివ్వడానికే శ్మశాన వాసిగా ఉంటాడు పరమశివుడు. ఒక వ్యక్తి తన సమాధి మీద యిలా వ్రాయమని చెప్పాడట. ‘మీలాగా నేనుండేవాణ్ణి నాలాగే మీరౌతారు’ తన ఉనికి అశాశ్వతమని గుర్తుంచుకొని, అహంకారాన్ని రూపుమాపుకొని, వినయాన్ని విస్మరించక, వివేకంతో పరిమిత జీవితాన్ని ప్రతిక్షణం సద్వినియోగం చేసికోవాలని హెచ్చరిస్తున్నాడు శ్మశానవాసియైన పరమశివుడు.

🌺భూచరీ ముద్రలో ఉండటం..

నేత్ర దృష్టి నాసికాగ్రంపై కేంద్రీకృతమై ఉంటుంది. సిద్ధయోగ సమాధి. ఆజ్ఞా చక్రంలో శివుడితో శక్తి ఐక్యమవుతుంది, ఆజ్ఞాచక్రమే శివనివాసం. తదుపరి, చంద్ర మండలమైన సహస్రారం, ఆపైన తురీయం. ఆజ్ఞా చక్రం యోగ శాస్త్రాలకు కేంద్ర బిందువు. నేత్రద్వయం దగ్గర ప్రారంభమై రెండున్నర అంగుళాలు ఎగువ భాగానికి వ్యాపించి ఉంటుంది అందుకే అడ్డంగా భస్మం ధరిస్తారు.

🌺శివతాండవం

హిమాలయం ఒక ఉన్నతమైన పర్వతరాజం. అందులో ఉన్నతోన్నతమై, అతి పవిత్రమైనది కైలాస శిఖరం. ఆ మహాశిఖర మందు మనోహరమైన మానస సరోవరం. కైలాస శిఖరం మీద శివతాండవం బ్రహ్మాది దేవతలు శివతాండవ దర్శనానికి విచ్చేశారు. శివతాండవానికి మానస సరోవరం స్పందిస్తుంది, దానిలోనే శివతాండవ నాట్య ప్రతిఫలనం. అది ఆనందమయం. అందుకే అది ఆనంద శివతాండవం. సరోవర మధుర స్పందనల సమాహారం గంగా ప్రవాహం. అప్పుడే, అనంత విశ్వంలోని నిరంతర చైతన్య స్వరూపమే మహాశివుడని, శివతాండవం దర్శింపజేస్తుంది. చీమ నుంచి బ్రహ్మ వరకు – సర్వమూ సర్వేశ్వరుని లీలా విలాసమే. ఆనంద శివతాండవంలో స్వామి, నటరాజ స్వామిగా దర్శనమిస్తాడు. ఇది ప్రదోషకాల పూజ. దోషము అంటే రాత్రి. రాత్రికి ముందు సమయము – ప్రదోష కాలం. ప్రదోష కాలపూజ శివునికి ప్రీతికరం.

🌺 నందివాహనం ఎందుకు?

పరమ శివుడు సర్వాంతర్యామి గదా, మరి ఆయనకు నంది వాహనమెందుకు? పరమాత్మ తత్త్వానికి లింగము ఎలా చిహ్నమో, జీవ తత్త్వానికి నంది చిహ్నము. పశుత్వముతో కూడిన జీవ తత్త్వము ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పక, ఈశ్వరుని వైపు త్రిప్పటం చేత భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందింది, నంది. నందికి ఈశ్వరునికి మధ్యలో, ఎవరూ అడ్డు తగలకూడదు. నంది ధర్మానికి ప్రతీక. నంది శృంగముల మధ్య నుండి ఈవ్వర లింగాన్ని దర్శించాలని చెప్తారు. పశుత్వము నుండి ధర్మాన్ని ఆచరిస్తూ దైవత్వాన్ని చింతించటం ద్వారా, నంది ఈశ్వరునిగా మారి, నందీశ్వరుడుగా ఏకమవుతాడు. పశుతత్త్వాన్ని విసర్జించి దృష్టిని ఈశ్వరుని వైపు మరల్చి ధర్మ మార్గంలో నడవటం చేతనే నంది, నందీశ్వరుడుగా మారిపోయాడు.

🌺లింగరూప విశిష్టత

నశించే దానికి సాక్షి శివమే. మన శరీరాన్ని దీని చుట్టూ పరచుకొని ఉన్న ఈ ప్రపంచాన్ని నిత్యమూ గమనిస్తున్నది మన ‘జ్ఞానం’ దీనికి ‘చిత్’ అని పేరు, వేదాంత పరిభాషలో. తానుండే గదా దేనినైనా గమనించవలసింది. ఈ ఉండటానికే ‘సత్’ అని పేరు. పరిపూర్ణమైన సత్ చిత్‌ల సమాహారమే – శివస్వరూపం. అవి నామ రూపాలన్నింటి నిలయం చేసికొని నిరాకారంగానే శేషించిన భావాలు గనుక – లింగ రూపం. రూపం గాని రూపమిది. శివత్త్వానికి ఆది మధ్యాంతాలు లేవని చెప్పడానికే దాన్ని లింగ రూపంగా భావన చేశారు. ఇది నిరాకార నిర్గుణ నిరంజన తత్వం ‘లీనం గమయతీతి లింగం’.

మీ సమస్య ఏదైనా శివరాత్రి (Shivaratri) రోజు ఇలా చెయ్యండి..

వివిధ ఫలితములకు మహా శివునికి ఈ క్రింది విధం గా శివరాత్రి (Shivaratri) రోజు అభిషేకించాలి పూజించాలి:

  1. రోగబాధలు తొలగుటకు : తుమ్మ పువ్వులతో శివ అర్చన చెయ్యవలెను.
  2. ప్రాణాపాయ సంకటం ICU లో ఉన్న వ్యక్తిని కాపాడుటకు : నువ్వుల నూనెతో అర్చన చెయ్యవలెను.
  3. శత్రు -రోగ బయములు తొలగుటకు : 5-11-23-31 తెల్ల జిల్లేడు పుష్పాలతో శివ ఆరాధనా చేసుకోవాలి.
  4. ధన వృద్ధి : బిల్వాదల అభిషేకం.
  5. భోగ, మోక్షములు : తులసి దళం.
  6. దాంపత్య సౌక్యత : 5 రకముల పండ్ల రసాలు తో.
  7. కళ్యాణ ప్రాప్తి : వివిధ రకముల పుష్పాలతో.
  8. ముక్తి కోసం : గంగా జలం లో చిన్న బంగార ముక్క వేసి అ జాలం తో అభిషేకం.
  9. మోక్షదాయిని కొరకు : గంగా జలం+కర్పూరo కలిపి అభిషేకించాలి.
  10. సిరిసంపదలు : గంగా జలం లో చిన్న వెండి ముక్క వేసి అ జాలం తో అభిషేకం.
  11. ముక్తి : ఉసిరి జలం తో అభిషేకిస్తే మంచిది.
  12. కార్య సిద్ధి : విభూధి జలం తో అభిషేకిస్తే మంచిది.
  13. సుఖ-సంపద : పారిజాత పుష్పాలతో పూజిస్తే మంచిది.
  14. సుఖ-సంతోషం : నూకలు లేని బియ్యం తో శివ అర్చన చెయ్యాలి.
  15. భోగ భాగ్యాలు ప్రాప్తి : సంపెంగ నూనెతో శివ అర్చన.
  16. అన్యోన్య దాంపత్యం : నిమ్మ నూనే తో శివ అర్చన.
  17. సర్వారిష్టాలు తొలుగుటకు : ద్రాక్షారిష్టంతో అభిషేకం.
  18. క్షయవ్యాది తగ్గుటకు : తేనెతో అభిషేకం.
  19. దీర్ఘాయువు కలగుటకు : 5 దళముల గరికి తో శివార్చన.

🙏ఓం నమః శివాయఅనే పంచాక్షరీ జపం చేసుకోండి.

నియమాలు:

అవసరం అయితేనే మాట్లాడాలి స్మరణకు సౌచం లేదు ఏ స్థితిలో వారైనా పైకి అనకుండా మనసులో జపించుకోవచ్చు శివరాత్రి (Shivaratri) పూర్తి అయ్యాక తెల్లవారే వరకు వరకు ఇలా చేద్దాం.. మనసుని బుద్దిని ఆలోచనని శ్రద్ధా భక్తితో సమర్పించడం కన్నా గొప్ప ఉపాసనా ఏముంటుంది, శివ రాత్రి రోజు చేసుకునే పూజ అభిషేకం అర్చన జాగరణ యధా విధిగా చేసుకుంటూ మిగతా సమయం అంతా నామ జపం తోనే కొనసాగిద్దాం.. ఇంత మంది కలిసి చేసే ఈ మానసిక జపం కొన్ని లక్షల సార్లు అవుతుంది, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు శివ భక్తులు అంతా ఈ శివరాత్రి (Shivaratri) వేడుకని ఇలా భక్తితో జరుపుకుందాం..

108 నామాలు ఒకసారి చదువుకోండి.. మహిమాన్విత 108 లింగాలు

1. ఓం లింగాయ నమః
2. ఓం శివ లింగాయనమః
3. ఓం శంబు లింగాయనమః
4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః
5. ఓం అక్షయ లింగాయనమః
6. ఓం అనంత లింగాయనమః
7. ఓం ఆత్మ లింగాయనమః
8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః
9. ఓం అమర లింగాయనమః
10. ఓం అగస్థేశ్వర లింగాయనమః

11. ఓం అచలేశ్వర లింగాయనమః
12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః
13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః
14. ఓం అపూర్వ లింగాయనమః
15. ఓం అగ్ని లింగాయనమః
16. ఓం వాయు లింగాయనమః
17. ఓం జల లింగాయనమః
18. ఓం గగన లింగాయనమః
19. ఓం పృథ్వి లింగాయనమః
20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః

21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః
22. ఓం ప్రణవ లింగాయనమః
23. ఓం పగడ లింగాయనమః
24. ఓం పశుపతి లింగాయనమః
25. ఓం పీత మణి మయ లింగాయనమః
26. ఓం పద్మ రాగ లింగాయనమః
27. ఓం పరమాత్మక లింగాయనమః
28. ఓం సంగమేశ్వర లింగాయనమః
29. ఓం స్పటిక లింగాయనమః
30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః

31. ఓం సువర్ణ లింగాయనమః
32. ఓం సుందరేశ్వర లింగాయనమః
33. ఓం శృంగేశ్వర లింగాయనమః
34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః
35. ఓం సిధేశ్వర లింగాయనమః
36. ఓం కపిలేశ్వర లింగాయనమః
37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః
38. ఓం కేదారేశ్వర లింగాయనమః
39. ఓం కళాత్మక లింగాయనమః
40. ఓం కుంభేశ్వర లింగాయనమః

41. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః
42. ఓం కోటేశ్వర లింగాయనమః
43. ఓం వజ్ర లింగాయనమః
44. ఓం వైడుర్య లింగాయనమః
45. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః
46. ఓం వేద లింగాయనమః
47. ఓం యోగ లింగాయనమః
48. ఓం వృద్ధ లింగాయనమః
49. ఓం హిరణ్య లింగాయనమః
50. ఓం హనుమతీశ్వర లింగాయనమః

51. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః
52. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః
53. ఓం భాను లింగాయనమః
54. ఓం భవ్య లింగాయనమః
55. ఓం భార్గవ లింగాయనమః
56. ఓం భస్మ లింగాయనమః
57. ఓం భిందు లింగాయనమః
58. ఓం బిమేశ్వర లింగాయనమః
59. ఓం భీమ శంకర లింగాయనమః
60. ఓం బృహీశ్వర లింగాయనమః

61. ఓం క్షిరారామ లింగాయనమః
62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః
63. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః
64. ఓం మహా రుద్ర లింగాయనమః
65. ఓం మల్లికార్జున లింగాయనమః
66. ఓం మహా కాళేశ్వర లింగాయనమః
67. ఓం మల్లీశ్వర లింగాయనమః
68. ఓం మంజునాథ లింగాయనమః
69. ఓం మరకత లింగాయనమః
70. ఓం మహేశ్వర లింగాయనమః

71. ఓం మహా దేవ లింగాయనమః
72. ఓం మణికంధరేశ్వర లింగాయనమః
73. ఓం మార్కండేయ లింగాయనమః
74. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః
75. ఓం ముక్తేశ్వర లింగాయనమః
76. ఓం మృతింజేయ లింగాయనమః
77. ఓం రామేశ్వర లింగాయనమః
78. ఓం రామనాథేశ్వర లింగాయనమః
79. ఓం రస లింగాయనమః
80. ఓం రత్నలింగాయనమః

81. ఓం రజిత లింగాయనమః
82. ఓం రాతి లింగాయనమః
83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయనమః
84. ఓం గోమేధిక లింగాయనమః
85. ఓం నాగేశ్వర లింగాయనమః
86. ఓం ఓంకారేశ్వర లింగాయనమః
87. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః
88. ఓం శరవణ లింగాయనమః
89. భృగువేశ్వర లింగాయనమః
90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః

91. ఓం చౌడేశ్వర లింగాయనమః
92. ఓం ధర్మ లింగాయనమః
93. ఓం జోతిర్ లింగాయనమః
94. ఓం సైకత లింగాయనమః
95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః
96. ఓం జ్వాలా లింగాయనమః
97. ఓం ధ్యాన లింగాయనమః
98. ఓం పుష్యా రాగ లింగాయనమః
99. ఓం నంది కేశ్వర లింగాయనమః
100. ఓం అభయ లింగాయనమః

101. ఓం సహస్ర లింగాయనమః
102. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః
103. ఓం సాలగ్రామ లింగాయనమః
104. ఓం శరభ లింగాయనమః
105. ఓం విశ్వేశ్వర లింగాయనమః
106. ఓం పథక నాశన లింగాయనమః
107. ఓం మోక్ష లింగాయనమః
108. ఓం విశ్వరాధ్య లింగాయనమః

Also Read:  Fasting on Shivaratri: శివరాత్రి రోజు ఉపవాసం చేస్తున్నారా? వీటిని ఉపవాసంలో తినవచ్చు..