Holi Festival: రంగుల పండుగ హోలీ వస్తోంది. మనం శుక్రవారం రోజు (మార్చి 14న) హోలీ పండుగను జరుపుకోబోతున్నాం. అయితే ఆ రోజుకు సంబంధించిన రాశిఫలాల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హోలీ వేడుకల వేళ మూడు రాశుల వాళ్లకు లక్కు కలిసి రానుంది. వారు అనుకున్న పనులు పూర్తి కానున్నాయి. పండుగ రోజున వాళ్లకు బుధాదిత్య రాజయోగం పట్టనుంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఏకకాలంలో మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా ఏప్రిల్ 15 వరకు మేష, వృశ్చిక, సింహ రాశుల వారికి ధనయోగం ప్రాప్తిస్తుంది.
సింహ రాశి
హోలీ పండుగ రోజున(Holi Festival) సింహరాశి వారు బుధాదిత్య రాజయోగంతో పలు ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు పండుతాయి. విహార యాత్రల కోసం ప్లాన్ చేస్తారు. ఖర్చులు కూడా పెరుగుతాయి. అప్పుల భారం తగ్గిపోతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రభుత్వం ద్వారా గుర్తింపు లభిస్తుంది. రాజకీయంగా ప్రాబల్యం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
మేష రాశి
హోలీ పండుగ రోజున మేష రాశి వారి అప్పులు తీరే మార్గాలు దొరుకుతాయి. డబ్బులు చేతికి అందుతాయి. ఆస్తి వివాదాలు సమసిపోతాయి. కొత్త ఆస్తులు కొంటారు. విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అవుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభానికి మంచి సమయం. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమలో పడతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
హోలీ పండుగ రోజున వృశ్చిక రాశి వారు తీసుకునే పెట్టుబడి నిర్ణయాలు రాబోయే కాలంలో కాసుల వర్షం కురిపిస్తాయి. అయితే ఆర్థిక నిపుణుల సలహా తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఈవిషయంలో తొందరొద్దు. జాబ్ ప్రమోషన్ వస్తుంది. ఎక్కువ శాలరీతో కొత్త జాబ్ ఆఫర్ మీ తలుపు తడుతుంది. అయితే ఆచితూచి నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలతో ఆదాయం పెరుగుతుంది.
Also Read :God Is Real : దేవుడు ఉన్నాడు.. గణిత ఫార్ములాతో నిరూపిస్తా.. శాస్త్రవేత్త విల్లీ సూన్
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.