Site icon HashtagU Telugu

Camphor Lamp: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలిగిపోవాలంటే.. కర్పూర దీపాన్ని వెలిగించాల్సిందే!

Camphor Lamp

Camphor Lamp

దీపావళి రోజు ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించడం అన్నది మనందరికి తెలిసిన విషయమే. ఈ దీపాల కాంతులలో ఇల్లు మెరిసిపోతూ ఉంటుంది. అయితే ఈ దీపావళి పండుగ రోజున చాలామంది రకరకాల దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఆ దీపాలతో పాటు ఇంట్లో తప్పనిసరిగా కర్పూర దీపాన్ని వెలిగించాల్సిందే అంటున్నారు పండితులు. మరి ఇంట్లో కర్పూర దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కర్పూరం సువాసనకు బ్యాక్టీరియాను తొలగించే శక్తి ఉంది.

కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు అంతా తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందట. అందుకే చాలా మంది ప్రజలు పూజ సమయంలో కర్పూరాన్ని వెలిగించి దేవుళ్లకు హారతి ఇచ్చి ఇంట్లో ఆ పొగను కమ్మేలా చేస్తారు. అయితే దీపావళి రోజు కచ్చితంగా ఇంట్లో కర్పూర దీపాన్ని వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఇది మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిస్తుందట. సాయంత్రం పూట ఇంట్లో కర్పూర దీపం పెట్టడం వల్ల మీ ఇల్లు కర్పూరం వాసనతో నిండిపోతుంది. ఇది ఇంట్లో పాజిటివిటీని పెంచుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ కర్పూర దీపాన్ని ఎలా వెలిగించాలి? ఎలా తయారు చేసుకోవాలి? అన్న విషయానికి వస్తే.. కర్పూరం దీపం తయారు చేయాలంటే ఒక ప్రమిదను తీసుకోవాలి.

ఆ ప్రమిద ఇత్తడి లేదా రాగితో తయారు చేసినదై ఉండాలి. ఇది కాకుండా దీపం పైన ఉంచడానికి మీకు స్టీల్ గిన్నె, నీరు, లవంగాలు, కర్పూరం బిళ్లలు అవసరం. ఈ వస్తువులతో మీ కర్పూరం దీపం తయారైపోతుంది. దీని కోసం, ముందుగా మీ దీపాన్ని నెయ్యి లేదా నూనెతో వెలిగించాలి. దీని తరువాత, ఒక గిన్నె తీసుకొని దానిలో సగం నీటితో నింపండి. ఇప్పుడు దానిలో నాలుగైదు కర్పూరం బిల్లలు, నాలుగైదు లవంగాలు వేయాలి. ఇప్పుడు ఈ గిన్నెను దీపం పైన ఉంచాలి. దీపం వెలిగినప్పుడు, ఆ గిన్నె వేడెక్కి అందులోంచి పొగలు వస్తాయి. మీ ఇల్లంతా సువాసనలు వీస్తాయి. ఈ కర్పూరం దీపాలు మీ ఇంటిని ఐదారు గంటల పాటు ఫ్రెష్ గా ఉంచుతుంది.

మీకు నచ్చినప్పుడల్లా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ముఖ్యంగా సాయంత్రం పూట వెలిగించడం అవసరం. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివిటీ నిండిపోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే దీపావళి నాడు ప్రత్యేకంగా ఈ కర్పూర దీపాలను వెలిగించాల్సిందే. అలాగే ప్రతి వారం ఒకసారైనా ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించాలనీ అలా చేస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. ఇళ్లు ప్రశాంతంగా ఉండాలన్నా, ఇంట్లోవారి మానసిక ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా కర్పూర దీపాలను వెలిగించాల్సిన అవసరం ఉందట.