Chaturgraha Yoga – October 19 : రేపు (అక్టోబర్ 19న) చతుర్గ్రహ యోగం ఏర్పడబోతోంది. అక్టోబర్ 19న కుజుడు, కేతువు, సూర్యుడు, బుధుడు తులారాశిలో కలిసి ప్రయాణిస్తాయి. దీనివల్ల తులా రాశిలో చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. తులారాశిలో ఈ నాలుగు గ్రహాల కలయిక 100 సంవత్సరాల తర్వాత జరుగుతోందని పండితులు అంటున్నారు. గ్రహాల కదలికలు మానవ జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల సంచార సమయంలో ఏర్పడే యోగాలు కూడా ప్రభావాన్ని చూపుతాయి. చతుర్గ్రహ యోగాలు రాశిని బట్టి శుభ, అశుభ ప్రభావాలను కలిగిస్తాయి. చతుర్గ్రహ యోగం వల్ల కొన్ని రాశుల అదృష్టం పెరుగుతుంది. ఆ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
We’re now on WhatsApp. Click to Join.
- మేషరాశి నుంచి 7వ స్థానంలో చతుర్గ్రహ యోగం ఏర్పడుతోంది. దీని ఎఫెక్ట్ తో ఈ రాశివారు ఉమ్మడి వ్యాపారంలో విజయాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకరినొకరు సంప్రదించుకోవడం మంచిది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. పెళ్లికాని వారు ఈ యోగం వల్ల మంచి అనుగ్రహాన్ని పొందుతారు.
- మకరరాశి నుంచి 10వ స్థానంలో చతుర్గ్రహ యోగం ఏర్పడుతోంది. ఈ రాశివారు వృత్తిపరంగా మంచి ఫలితాలను పొందుతారు. పదోన్నతి, జీతాల పెంపు లభిస్తాయి. కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందగలరు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ తండ్రి నుంచి పూర్తి సహకారం తీసుకోండి.
- కుంభ రాశి నుంచి 9వ స్థానంలో చతుర్గ్రహ యోగం ఏర్పడుతోంది. ఈ రాశివారు అదృష్టానికి చేరువ అవుతున్నారు. పనిలో ఆటంకాలు తొలగిపోయి గెలుపొందుతారు. ఉద్యోగం, వ్యాపారాలు చేసే వ్యక్తులు ఈ కాలంలో జర్నీ చేయాల్సి వస్తుంది. అయితే మీ ప్రయాణం కలిసొచ్చి ఊహించని ఆర్థిక ప్రయోజనాలను (Chaturgraha Yoga – October 19) అందుకుంటారు.
Also Read: Telangana : 37 మందితో బిజెపి ఫస్ట్ లిస్ట్..ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే..!
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.