Site icon HashtagU Telugu

Deeparadhana: పూజలో నెయ్యి లేదా నూనె.. దేనితో వెలిగిస్తే అదృష్టం వస్తుందో తెలుసా?

Mixcollage 16 Jul 2024 10 18 Am 397

Mixcollage 16 Jul 2024 10 18 Am 397

మామూలుగా మనం ఇంట్లో అలాగే దేవాలయాల్లో పూజ చేసినప్పుడు దీపారాధనకు అనేక రకాల నూనెలను ఉపయోగిస్తూ ఉంటాం. నువ్వుల నూనె కొబ్బరి నూనె,ఆవనూనె,ఆముదం నూనె, నెయ్యి ఇలా రకరకాల నూనెలను ఉపయోగించి దీపారాధన చేస్తుంటాం. అయితే పూజలో నెయ్యి దీపాలు లేదంటే నూనె దీపాలు వెలిగించడం మనం గమనించే ఉంటాం. అయితే మరి పూజ చేసేటప్పుడు దీపానికి నెయ్యి లేదా నూనె దీనిని ఉపయోగించాలి? దేనిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం ఒక్కొక్క నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క ప్రత్యేకత, లాభం కలుగుతుంది అంటున్నారు పండితులు.

కాగా నెయ్యి దీపం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కానీ నూనె దీపం కంటే నెయ్యి దీపం చాలా ఖరీదైనది. కాబట్టి ప్రజలు నూనె దీపాలను ఎక్కువగా వెలిగిస్తుంటారు. దేవుని కుడి చేతిలో నెయ్యి దీపం లేదా ఎడమ చేతిలో నూనె దీపం వెలిగించడం శ్రేయస్కరమని సనాతన ధర్మ గ్రంధాలలో చెప్పబడింది. నెయ్యి దీపాన్ని ఎల్లప్పుడు కూడా తెల్ల కొవ్వొత్తితో వెలిగించాలి. పూజా సమయంలో విశేష ఫలితాలు పొందాలి అనుకున్న వారు నువ్వుల నూనె వెలిగిస్తే దానికి ఎరుపు లేదా పసుపు దీపం పెట్టాలి. నెయ్యి దీపాలను అన్ని దేవతలకు దేవుళ్లకు అంకితం చేస్తారు. భైరవుడిని పూజించాలి అనుకున్న వారు ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట.

మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి అని చెబుతున్నారు.. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆ సమస్యల నుంచి గట్టెక్కాలి అంటే నెయ్యి దీపాన్ని వెలిగించాలి అంటున్నారు పండితులు. లక్ష్మీదేవి పూజలో నెయ్యి దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అని చెబుతున్నారు. అలాగే శని సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఆవాలు లేదా నువ్వుల నూనె దీపం వెలిగించాలని చెబుతున్నారు. ఇక భర్త చిరకాల కోరిక నెరవేరాలంటే ఇంట్లోని పూజా గదిలో ఆవనూనె దీపం వెలిగించాలట. ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడం కోసం మల్లెపూల నూనె దీపం వెలిగించాలని చెబుతున్నారు. శత్రువుల నుండి రక్షించుకోవడానికి భైరవుని స్థానంలో ఆవనూనె దీపం వెలిగించాలని చెబుతున్నారు. అదేవిధంగా సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల దీపం వెలిగించడం మంచిదని చెబుతున్నారు పండితులు. రాహు, కేతు గ్రహాల ఉధృతికి మునగ నూనె దీపం వెలిగించడం మంచిదట. నెయ్యి లేదా నూనెలో ఎక్కువ శాతం నెయ్యి దీపాన్ని వెలిగించడం వల్లే మంచి ఫలితాలు కలుగుతాయి అంటున్నారు పండితులు.

Exit mobile version