Site icon HashtagU Telugu

Navratri: నవరాత్రుల్లో దుర్గాదేవిని ఎలాంటి పూలతో పూజించాలో మీకు తెలుసా?

Navratri

Navratri

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా శరన్నవరాత్రుల వేడుకలు జరగనున్నాయి. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఒక్క దుర్గాదేవిని మాత్రమే కాకుండా చాలా మంది అమ్మవార్లను పూజిస్తూ ఉంటారు. దాదాపు తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారిని పూజిస్తుంటాము. ముఖ్యంగా నవరాత్రులు వచ్చాయి అంటే చాలు అమ్మవార్లను రకరకాల పువ్వులతో చాలా పువ్వులతో చాలా అందంగా అలంకరిస్తూ ఉంటారు. అయితే మరి నిజానికి దుర్గాదేవి పూజలు ఏ పూలను ఉపయోగించాలి? ఎలాంటి పూలను ఉపయోగించి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దుర్గామాత పూజలో ఎర్ర మందార పువ్వును ఖచ్చితంగా సమర్పిస్తారు. ఎందుకంటే అది ఆమెకు ఇష్టమైన పువ్వు. అది లేకుండా నవరాత్రి పూజలు అసంపూర్ణంగా పరిగణిస్తారు. ఇంతకీ అమ్మవారికి ఎర్ర మందార పువ్వులు ఎందుకు అంత ఇష్టం అన్న విషయానికి వస్తే.. దుర్గా సప్తశతిలోని దుర్గా రూప వర్ణనలో ఎర్ర మందార పుష్పం కూడా వర్ణించబడింది. ఈ కారణంగానే ఎర్రటి మందార పువ్వు ప్రియమైనదని నమ్ముతారు. ఎరుపు రంగు అదృష్టం, బలం, ధైర్యం, ధైర్యానికి చిహ్నం. దుర్గ మాత ఆదిపరాశక్తి కాబట్టి ఆమెకు ఎరుపు రంగు వస్తువులు సమర్పిస్తారు. ఎరుపు చునారి, ఎరుపు చీర, ఎరుపు పువ్వులు మొదలైనవి సమర్పించడం వాళ్ళ అమ్మవారు ఇంకా సంతోషిస్తుందట. అయితే దుర్గాదేవికి పుష్పాలను సమర్పించడం మంచిది. ఈ పూలను సమర్పించేటప్పుడు ఈ కింది మంత్రం తప్పనిసరిగా పటించాలట.

“ఓం మహిషఘ్నీ మహామాయా చాముణ్డే ముణ్డమాలినీ| నాకు దీర్ఘాయువు, ఆరోగ్యం , విజయాన్ని ప్రసాదించు, ఓ దేవా! నీకు నమస్కారములు. ఇదం గంధపు సువాసన పుష్ప బిల్వపత్రే ఓం హ్రీం దుర్గాయై నమః ।” అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి ఎర్రటి పువ్వులను ఎరటి చీరను, గాజులను సమర్పించాలని చెబుతున్నారు. భయం భక్తి నుండి విముక్తి పొందాలి అంటే నవరాత్రులలో మధ్యాహ్న సమయంలో కాళీదేవికి ఎర్రటి మందారలను సమర్పించాలని చెబుతున్నారు. ఇది కాళీమాతను ఎంతో సంతోష పరుస్తుందని ఆమె అనుగ్రహం భయాన్ని తొలగిస్తుందని చెబుతున్నారు. ప్రతికూల ప్రభావాలు ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు.

పనిలో విజయం, ఇబ్బందుల నుండి రక్షణ కోసం, నవరాత్రులలో, మీరు పూజ సమయంలో ఎరుపు మందార పువ్వులతో కాళీకి మాల వేయాలి. అప్పుడు శ్లోకం మంత్రాన్ని కనీసం 11 వేల సార్లు జపించండి. ఆశీర్వాదంతో పని విజయవంతం అవుతుంది. సమస్యలు కూడా పరిష్కారం అవుతాయట. అదేవిధంగా నవరాత్రులలో మంగళవారం నాడు దుర్గాదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలట. ఇది జాతకం నుండి అంగారక దోషాన్ని తొలగించగలదట. నవరాత్రులతో పాటు, ప్రతి మంగళవారం హనుమంతుడికి ఎర్ర మందార పువ్వును సమర్పించడం వల్ల కూడా అంగారక దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.