Viral Video: ఆకట్టుకుంటున్న అగ్గిపుల్లల రామ మందిరం నిర్మాణం.. నెట్టింట వీడియో వైరల్?

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. హిందువుల 5

  • Written By:
  • Publish Date - January 23, 2024 / 03:30 PM IST

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. హిందువుల 5 ఏళ్లనాటి కల కూడా నెరవేరింది. జనవరి 22 2024 తేదీ చరిత్రలో నిలిచిపోయింది. నిన్నటి రోజున అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా దేశం నలుమూలల నుండి సెలబ్రేతీలు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా రామ నామం మార్మోగింది. ఈ సందర్భంగా అయోధ్య నుండే కాకుండా దేశం నలుమూలల నుండి వివిధ రకాల చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే అయోధ్యలో బాల రాముడు గణపతి సందర్భంగా భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వామి వారిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. కొందరు బంగారు ఆభరణాలను ఇస్తే మరికొందరు డబ్బులను మరికొందరు పట్టు వస్త్రాలను ఎలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వామివారికి కానుకలు సమర్పించారు. అయితే కొందరు వారిలో ఉన్న క్రియేటివిటీ ని బయటకు తీసుకువస్తూ బిస్కెట్లతో చాట్ పీస్ లతో, ఇసుకతో రామ మందిరాన్ని నిర్మించినందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి ప్రతి ఒక్కటి కూడా రామ భక్తులను నెటిజెన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక వ్యక్తి ఏకంగా అగ్గిపుల్లలతో రామమందిరాన్ని నిర్మించారు.

ఆయన కష్టానికి, టాలెంట్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అగ్గిపుల్లల రామ మందిర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశాకు చెందిన సాస్వత్ రంజన్ వృత్తి రీత్యా శిల్పి. అతను అగ్గిపుల్లలను ఉపయోగించి అయోధ్య రామాలయ ప్రతిరూపాన్ని అద్భుతంగా సృష్టించాడు. రామ మందిరం ప్రతిరూపాన్ని తయారు చేయడానికి తనకు మొత్తం ఆరు రోజులు పట్టిందని, మొత్తం 936 అగ్గిపుల్లలను ఉపయోగించారని సాస్వత్ చెప్పారు. ఈ ఆలయం 4 అంగుళాల పొడవు, 7 అంగుళాల వెడల్పుతో ఉంటుంది.. ఇంతకంటే చిన్న రామ మందిరాన్ని అగ్గిపుల్లతో నిర్మించవచ్చని నేననుకోవడం లేదని సాస్వత్ తెలిపారు. ఈ రామ మందిరాన్ని ప్రధాని మోడీకి కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. కనుక తన కోరిక తీర్చడానికి ఎవరైనా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడు ఈ కళాకారుడు.