Jagannath Temple Flag: పూరి జగన్నాథ్ ఆలయంపై ఉన్న జెండాను ప్రతిరోజు ఎందుకు మారుస్తారు? దాని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?

పూరి జగన్నాథ్ ఆలయం పై ఉన్న జెండాలో ప్రతిరోజు ఎందుకు మారుస్తారు దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Jagannath Temple Flag

Jagannath Temple Flag

ఒడిశాలోని పూరి నగరంలో ఉన్న హిందూ దేవాలయం జగన్నాథ పూరి ఆలయం గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఆలయం జగన్నాథుడికి అంకితం చేయబడింది. ఇక్కడ కృష్ణుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలకు ప్రతి రూపంగా భావిస్తారు. ఇది భారతదేశంలోని నాలుగు ధామ్ తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటి. ఈ క్షేత్రానికి హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో గంగా రాజవంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగ దేవ ప్రారంభించగా 13వ శతాబ్దంలో అనంగభీమ దేవ పూర్తి చేశారు. ఆలయ గర్భగుడిలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర చెక్కతో చేసిన విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి.

ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఈ విగ్రహాలను నబకలేబారా అని పిలిచే కొత్త విగ్రహాలతో భర్తీ చేస్తారు. ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఇప్పటికీ మిస్టీరియస్ గాని మిగిలిపోయాయి. కొన్ని శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. ఈ ఆలయ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ ఆలయంలో తయారుచేసిన మహాప్రసాదానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని వేలాది మంది భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ ఆలయ వంటగది ప్రపంచంలోని అతిపెద్ద ఆలయ వంటశాలలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయానికి సంబంధించి అనేక రహస్యాలు ఉన్నాయి. వాటిలో ఆలయం పైభాగంలో ఉంచిన జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం కూడా ఒకటి. ఆలయం నీడ రోజులో ఏ సమయంలోనూ కనిపించదు.

అందువల్ల జగన్నాథ పూరి ఆలయం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు ఇది భారతదేశ గొప్ప సాంస్కృతిక , చారిత్రక వారసత్వాన్ని కూడా సూచిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి ఉంటారు. పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజూ జెండాను మార్చే సంప్రదాయానికి లోతైన మతపరమైన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ సంప్రదాయం సుమారు 800 సంవత్సరాలుగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన అనేక నమ్మకాలు, రహస్యాలు ఉన్నాయి. జగన్నాథ ఆలయం పైభాగంలో ఉన్న 20 అడుగుల పొడవైన త్రిభుజాకార జెండాను ప్రతిరోజూ మారుస్తారు. ఈ పనిని చోళ కుటుంబం చేస్తుంది.

వారు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కాగా ఈ జెండాను జగన్నాథుని ఉనికి, శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ జెండా సముద్రం నుంచి వీచే గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. ఇదే ఒక రహస్యం శాస్త్రీయ దృక్కోణంలో ఇది ఏరోడైనమిక్ ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు. ఇక్కడ ఆలయ నిర్మాణం కారణంగా గాలి దిశ మారుతుంది. ఆలయ శిఖరంపై జెండాను మార్చే ప్రక్రియ చాలా సాహసోపేతమైనదని చెప్పాలి. సేవకులు ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండానే 214 అడుగుల ఎత్తైన ఆలయం శిఖరాన్ని ఎక్కి పాత జెండాను తీసి కొత్త జెండాను ప్రతిష్టించాలి. ఈ సాంప్రదాయం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది.

  Last Updated: 23 Apr 2025, 03:34 PM IST