వాస్తుప్రకారం కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే. వాస్తు శాస్త్రం అనేది ప్రకృతి యొక్క ఐదు ప్రాథమిక అంశాలు, వ్యక్తులు, వస్తువుల లక్షణాల కలయికతో పనిచేసే శాస్త్రంగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం సానుకూల పని, జీవన వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యం, ఆనందం, సంపద, శ్రేయస్సును పెంచుతుంది. మనం ఎలాంటి పని చేపట్టినా వాస్తు తప్పనిసరిగా చూడాల్సిందే. ఒక వస్తువును ఇంట్లో పెట్టాలన్నా..వాస్తు చూడాల్సిందే. లేదంటే ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. మనం అవసరం లేని వస్తువులను ఇంట్లో స్టోర్ రూంలో పడేస్తుంటాం. కానీ స్టోర్ రూంలో కూడా వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదు. మరీ ముఖ్యం ఈ రెండు వస్తువులు ఉంచకూడదు. అవేంటో చూద్దాం
స్టోర్ రూంలో ఉంచకూడని వస్తువులు:
తుప్పు పట్టిన వస్తువులు:
వాస్తు శాస్త్రం ప్రకారం…మీరు ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులను ఉంచకూడదు. అలా ఉంచితే చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఎలాంటి పనులు ముందుకు సాగలేవు.
ఇత్తడి పాత్రలు:
ఇత్తడిని పిటల్ అని కూడా పిలుస్తారు. భారతీయ గృహాలలో ఇత్తడి పాత్రలు సర్వసాధారణం. కానీ మీరు పాత ఇత్తడి పాత్రలు స్టోర్ రూంలో ఉంచకూడదు. ఎందుకంటే వాస్తు ప్రకారం శనిదేవుడు ఇత్తడి, బంగారం కుండల్లో ఉంటాడని విశ్వసిస్తారు. ఇలా స్టోర్ రూంలో వీటిని పడేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంది.