Site icon HashtagU Telugu

Kumbhamela: కుంభమేళాకు వెళ్లలేకపోతున్నామని దిగులు చెందుతున్నారా.. ఇలా చేస్తే కుంభమేళాకు వెళ్ళినంత ఫలితం!

Kumbhamela

Kumbhamela

ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మహా కుంభమేళాకు దేశం వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలి వస్తున్నారు. కోట్లాదిమంది భక్తులు తరలి వస్తున్నారు. అయితే కొంతమంది సమయం చూసుకొని మహాకుంభమేళకు వెళుతుండగా అక్కడ జనాలను చూసి వెళ్లకుండా చాలామంది ఆగిపోతున్నారు. చాలామంది మహా కుంభమేళాకు వెళ్లలేకపోతున్నామే అని దిగులు చెందుతూ బాధపడుతూ ఉంటారు. అయితే ఆ బాధ అవసరం లేదని, కుంభమేళాకు వెళ్లకపోయినా మీరు ఉన్న ప్రదేశం నుంచి కొన్ని రకాల పనులు చేస్తే కుంభమేళాకు వెళ్లిన ఫలితం దక్కుతుందని పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు చేయలేని వారు మీకు సమీపంలోని పవిత్ర నదులలో పుణ్య స్నానం చేయాలట. మూడు సార్లు లేదా ఐదుసార్లు మునక వేయాలని చెబుతున్నారు. లేదంటే ఎవరైనా కుంభమేళాకు వెళ్లి వస్తే వారితో కొద్దిగా నీటిని తీసుకొని ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని వాటితో స్నానం చేసినా కూడా స్నానం చేసిన ఫలితం దక్కుతుందట. స్నానం చేసిన తర్వాత శ్రీహరి లక్ష్మీదేవిని గంగామాతను పూజించాలని చెబుతున్నారు మహా కుంభమేళాకు వెళ్లలేని భక్తులు మౌన ఉపవాస దీక్ష చేయాలి.

దీనివలన శుభం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే సాయంత్రం ఇంట్లో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలట. భక్తితో పూజలు చేయాలని చెబుతున్నారు. దానికి తోడు ప్రస్తుతం మాఘమాసం కావడంతో ఈ మాసంలో తులసి వద్ద ప్రత్యేక పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందట.అ అలాగే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు అర్ఘ్యంగా సమర్పించాలని చెబుతున్నారు. ఈ పనులు చేస్తే మీరు అక్కడికి వెళ్లకపోయినా కుంభమేళాకు వెళ్లిన ఫలితం దక్కుతుందని చెబుతున్నారు.