Site icon HashtagU Telugu

10 Avatars : మహాశివుడి పది అవతారాల గురించి తెలుసా..

Shani Pradosh Vrat

10 Avatars : శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి మనందరికీ తెలుసు. అయితే పరమశివుడు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం కొన్ని అవతారాలను స్వీకరించారు. ఆ అవతారాల(10 Avatars) గురించి శివ మహా పురాణంలోని 17వ అధ్యాయంలో ప్రస్తావన ఉంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

మహాకాల అవతారం

శివుడి మొదటి అవతారం మహాకాల అవతారం. ఇందులో అమ్మవారు మహాకాళిగా శివుడి అర్ధాంగిగా అవతరించారు. తనను ఆశ్రయించిన భక్తులను ఈ అవతారంలో శివుడు అనుగ్రహించాడు.

తార్

శివుడి రెండో అవతారం పేరు తార్. ఇందులో అమ్మవారు శక్తి తార పేరుతో శివుడిని అనుసరించారు. ఈ అవతారంలో వారు తమ భక్తులకు ముక్తిని ప్రసాదించారు.

బాల భువనేశుడు

శివుడి మూడో అవతారం పేరు బాలభువనేశుడు. ఇందులో అమ్మవారు బాలభువనేశ్వరిగా శివుడిని అనుసరించారు.  తమ భక్తులకు సుఖాలను ప్రసాదించారు.

శ్రీషోడష శ్రీవిద్యేశుడు

శివుడి నాలుగో అవతారం పేరు శ్రీషోడష శ్రీవిద్యేశుడు. ఇందులో అమ్మవారు శ్రీషోడషశ్రీవిద్యాదేవిగా శివుడిని అనుసరించారు. తమ భక్తులకు జ్ఞానం, సుఖసౌఖ్యాలను ప్రసాదించారు.

Also Read :Birds Facts: కిక్కు కోసం.. కెమికల్స్ కోసం.. పక్షుల వెతుకులాట

భైరవుడు

శివుడి ఐదో అవతారం పేరు భైరవుడు. ఇందులో అమ్మవారు భైరవిగా శివుడిని అనుసరించారు. తమ ఉపాసకులు, భక్తులను రక్షించారు.

చిన మస్తకుడు

శివుడి ఆరో అవతారం పేరు చినమస్తకుడు. ఇందులో అమ్మవారు చినమస్తకిగా శివుడిని అనుసరించారు. తమభక్తుల పాపాలను హరించారు.

ధూమవంతుడు

శివుడి ఏడో అవతారం పేరు ధూమవంతుడు. ఇందులో అమ్మవారు ధూమావతిగా శివుడిని అనుసరించారు. తమను కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లారు.

బగలాముఖుడు

శివుడి ఎనిమిదో అవతారం పేరు బగలాముఖుడు. ఇందులో అమ్మవారు బగలాముఖిగా శివుడిని అనుసరించారు. తమ భక్తుల ఈతిబాధలను పోగొట్టారు.

మాతంగుడు

శివుడి తొమ్మిదో అవతారం పేరు మాతంగుడు. ఇందులో అమ్మవారు మాతంగి పేరుతో శివుడిని అనుసరించారు. తమ భక్తులకు సిరిసంపదలను అందించారు.

కమలుడు

శివుడి పదో అవతారం పేరు కమలుడు. ఇందులో అమ్మవారు కమల పేరుతో శివుడిని అనుసరించారు. తమ భక్తులకు భోగభాగ్యాలను ప్రసాదించారు.