Vastu Shastra : ఈ రోజు గుడిలో చెప్పులు పోగొట్టుకుంటే మీఅంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు..!!

చెప్పులకు శనికి దగ్గరి సంబంధం ఉంటుంది. చెప్పులు పోయాయి అంటే ...శనిపోయినట్లే అంటుంటారు. ముఖ్యంగా దేవాలయాలకు దైవ దర్శనానికి వెళ్లినప్పుడు చెప్పులు పోతే బాధపడుతుంటాం.

  • Written By:
  • Updated On - October 18, 2022 / 04:41 AM IST

చెప్పులకు శనికి దగ్గరి సంబంధం ఉంటుంది. చెప్పులు పోయాయి అంటే …శనిపోయినట్లే అంటుంటారు. ముఖ్యంగా దేవాలయాలకు దైవ దర్శనానికి వెళ్లినప్పుడు చెప్పులు పోతే బాధపడుతుంటాం. అయ్యే మంచి చెప్పులు పోయాయి అని అనుకుంటుంటాం. కానీ అస్సలు బాధపడకూడదు…సంతోషంగా ఉండాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఆలయానికి వెళ్లినప్పుడు పాదరక్షలు దొంగించడబడితే శుభప్రదంగా పరిగణిస్తారు. కానీ శనివారం నాడు చెప్పులు పోతే అది మరింత శుభంగా భావిస్తారు.

1.గుడిలో చెప్పులు దొంగిలించంలో అర్థం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనివారం నాడు గుడి బయట ఆ వ్యక్తి పేదరికం నుండి విముక్తి పొందుతున్నట్లు అర్థం. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారనే నమ్మకం కూడా ఉంది. అయితే పాదరక్షాలను దొంగిలించిన వ్యక్తికి చెడుకాలం ప్రారంభం అవుతుందని అంటుంటారు.

శనివారం నాడు ఆలయం నుండి పాదరక్షలు అదృశ్యం కావడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది శని వల్ల కలిగే సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుందని నమ్ముతారు. శని పాదంలో ఉంటాడని నమ్ముతారు. అందువల్ల పాదరక్షాలను…శని పాదాలకు సంబంధించిన అంశంగా పరిగణిస్తారు.

శాస్త్రం ప్రకారం, ఒక జత చెప్పులు ఇతరులకు దానం చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని అశుభ దశ ఒక వ్యక్తి చేసే పనిని పాడు చేస్తుంది. వారు ఏ పనిలోనైనా విజయం సాధించలేరు. అలాంటి పరిస్థితిలో, శనివారం నాడు ఆలయంలో బూట్లు కానీ చెప్పులు పోయినట్లయితే అది శుభసూచకంగా పరిగణిస్తారు. కొందరు తమ చెప్పులను శనివారం ఆలయంలో వదిలివేస్తారు. ఇలా చేయడం వల్ల శని బాధలు తగ్గుతాయని నమ్ముతుంటారు.

జాతకంలో శని స్థానం అశుభంగా ఉంటే, వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. చేపట్టిన పనులు కూడా పూర్తికావు . కాబట్టి, శనివారం నాడు మీ చెప్పులు ఆలయం నుండి దొంగిలించబడినట్లయితే, మీ పనిలో విజయం సాధించబోతున్నారని అర్థం. మీ జీవితంలోని ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి.

మీరు శనివారం నాడు గుడికి వెళ్ళినప్పుడు, మీ చెప్పులు పోగొట్టుకుంటే, వాటి కోసం వెతకకండి. శనివారం నాడు గుడిలో చెప్పు పోగొట్టుకుంటే సంతోషించాల్సిందే. ఎందుకంటే అది మీపై ఉన్న శనిప్రభావాన్ని తొలగిస్తుందని అర్థం.