Nails Cutting: పదేపదే గోర్లు కొరుకుతున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

  • Written By:
  • Updated On - February 19, 2024 / 07:04 PM IST

ఇదివరకటి రోజుల్లో మన పెద్దలు ఎన్నో రకాల ఆచార్య వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను పాటించేవారు. వీటితోపాటు కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని రకాల పనులు చేయడాన్ని నిషేధించేవారు. అలా మన పెద్దలు ఏం చెప్పినా, ఏం చేసినా జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా అనుసరించేవారు. ఇప్పటికీ ఆ శాస్త్రాన్నే అనుసరిస్తున్నారు. ఈ ప్రకారం జీవితం నడుస్తుంటే ఆరోగ్యంతోపాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావించేవారు. పెద్దలు చెప్పిన ఆ విషయాలలో మంచి తో పాటు వాటి వెనక సైన్స్ కూడా దాగి ఉంది. అటువంటి వాటిలో తరచూ గోర్లు కొరకడం కూడా ఒకటి. మరి తరచూ గోర్లు కొరికితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మంగ‌ళ‌వారం జట్టు క‌త్తిరించుకోకూడ‌ద‌ని, గోర్లు కత్తిరించరాదనే ఆచారం ఉంది. కానీ ఎందుకు విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇంట్లోవారిని అడిగితే మన పెద్దవాళ్లు చెప్పారు. వారు ఒక ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. మనం కూడా చేయకూడదు అనే సమాధానం ఇస్తారు,కానీ పూర్తి వివరాలు చెప్పలేరు. మానవ శరీరంపై మంగళవారం అంగార‌క గ్ర‌హ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఈ గ్రహం అధిక వేడిని క‌లిగి ఉండటంతో మనిషి శరీరంపై ప్రభావం కూడా వేడిగా ఉంటుంది. ఇది ర‌క్తాన్ని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తుంది. ఆ రోజు శ‌రీరంపై ఎక్కువ‌గా గాయాలవడానికి, గాట్లు పడటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆ రోజు జట్టు కత్తిరించుకోవడం, గోర్లు క‌త్తిరించుకోవ‌డం చేయ‌కూడ‌ద‌ని ఆచారంగా వ‌చ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం అనేది హనుమంతుడికి సంబంధించినది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహానికి సంబంధించినది. ఆదివారం రోజు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. ఆదివారం సాక్షాత్తు ఆ నారాయణుడికి అంకితం చేయబడిందని, ఆ రోజు జుట్టు, గోళ్ళు కత్తిరించడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుందట. ఈ రోజుల్లో చాలామంది నడుస్తూ గోళ్లు కొరుక్కోవడం, బస్సులో వెళుతున్నప్పడు, బండిమీద ప్రయాణించేటప్పుడు కూడా కొంతమంది గోళ్లు కొరుకుతూ ఉంటారు. కొందరు పళ్ల కింద వేలిని నమిలి గోళ్లను కొరకడం, చాలా మంది గోళ్లతో గోళ్లను కూడా కొరుకుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదని, చేస్తే మన ఆరోగ్యంపై అనేక చెడు ప్రభావాలు కలుగుతాయట. శనివారం గోర్లు కత్తిరిస్తే ఇంట్లో గొడవలు జరుగుతాయని, మనశ్శాంతి కరువవుతుందట. కాబట్టి ఈ రోజుల్లో గోర్లు కత్తిరించడం లాంటివి చేయకూడదు..