Site icon HashtagU Telugu

Bhakthi Samacharam: దేవుడికి అలాంటి నైవేద్యం సమర్పిస్తే చాలు.. వెయ్యిరెట్ల ఫలితం దక్కాల్సిందే?

Mixcollage 05 Jan 2024 03 15 Pm 2529

Mixcollage 05 Jan 2024 03 15 Pm 2529

మామూలుగా హిందువులు ఎంతో మంది దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఎంతోమంది దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలను పెట్టుకొని ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఆయా దేవుళ్లకు ఇష్టమైన రోజుల్లో ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల దేవుళ్ళు కోరిన కోరికలు నెరవేరుస్తాడని నమ్మకం. అయితే మన అందరి ఇళ్ళలోనూ పూజావిధులు ఒకే రకంగా ఉండవు. సంప్రదాయాన్ని బట్టి సాంస్కృతిని బట్టి ప్రాంతాన్ని బట్టి దైవాన్ని బట్టి పూజా విధానాలు మారుస్తూ ఉంటాయి. అలాగే దేవుళ్ళకు రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

ప్రతి దేవతకు ఒక ప్రత్యేక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుందని మీకు తెలుసా. వాటిని ప్రసాదంగా నైవేద్యం పెడుతుంటారు. అయితే ఏ దైవానికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలని అవగాహనతో పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. పాయసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి ప్రార్ధమైన ప్రసాదంగా చెబుతారు. చాలా ఇష్టమైనవి కనుక ఆయనకు వాటిని సమర్పించుకోవచ్చు. లక్ష్మీదేవికి పాయసం అంటే ఎంతో ఇష్టం. లక్ష్మి పూజలో కూడా వీటిని వినియోగించవచ్చు. పంచామృతాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి వీటితోపాటు మిఠాయిలు ఏమైనా శివుడికి ఇష్టమైనవే. పార్వతికి పాయసం ఇష్టమైన పదార్థంగా చెబుతారు.

దేవునికి సమర్పించే నైవేద్యం కచ్చితంగా సాత్విక ఆహారమై ఉండాలి. పూజకు ఉపక్రమించే ముందు వ్యక్తిగత శుభ్రత కూడా చాలా ప్రదానం. దేవుడికి నైవేద్యం తయారు చేయడానికి ముందు కచ్చితంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి. పాడైపోయిన పదార్థాలు పొరపాటున కూడా భగవంతుడికి సమర్పించకూడదు. దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుచి చూడకూడదు. దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని తప్పనిసరిగా ముందుగా తీసి ఉంచాలి. దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత అది మిగతా భక్తులకు సమర్పించాలి. మామూలు పాలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఏది అందుబాటులో లేకపోతే అప్పటికప్పుడు స్నానం చేసి వండిన వంట ఏదైనా నైవేద్యంగా పెట్టచ్చు. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో పరిశుభ్రతను పాటించి దేవుడికి నైవేద్యం సమర్పించడం వల్ల ఆ దేవుడికి నైవేద్యం సమర్పించిన ఫలితం మీకు తప్పకుండా దక్కుతుంది. అలాగే మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.