TS : యాదాద్రి దేవస్థానంలో నిత్య కల్యాణోత్సవం సేవలు పునః ప్రారంభం

  • Written By:
  • Publish Date - May 23, 2024 / 11:41 AM IST

Yadadri Sri Lakshmi Narasimha Swamy : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri)లో ఈరోజు నుండి నిత్య కల్యాణోత్సం సేవలు(Nitya Kalyanotsavam Services) తిరిగి ప్రారంభం కానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణోత్సవం సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పడు ఆ సేవలు ఈరోజు నుంచి (మే 23) పునః ప్రారంభమయ్యాయి. బుధవారం నృసింహుడి జయంతి ఉత్సవాలు ముగియటంతో ఆ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా నిన్న (బుధవారం) అత్యంత విశేషమైన కలశాభిషేకాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. నిత్య కళ్యాణోత్సవంతో పాటు శ్రీసుదర్శన నారసింహ హోమం కూడా ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆయన కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో యాదాద్రి నరసింహాస్వామి ఆలయం ఒకటి. ఇక, ఈ ఆలయంలో నరసింహస్వామి జయంతోత్సవాలు (Narasimha Swamy Jayantotsava) ముగిసిన సందర్భంగా నిన్న (మే 22) శ్రీలక్ష్మీనరసింహస్వామికి కలశాలలోని పుణ్య జలం పంచామృతంతో వేపదపండితులు అభిషేక మహాపర్వాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు దంపతులు, ఆలయ ఈవో భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం స్వామివారికి మహా పూర్ణాహుతి జరపగా, రాత్రి జయంతి వేడుకగా నృసింహావిర్భావ ఘట్టాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ మహత్తర కార్యక్రమాలతో స్వామివారి జయంత్యుత్సవాలు ముగిశాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.

Read Also: Threat Call : ప్రధాని మోడీని చంపేస్తా.. ఎన్ఐఏ కంట్రోల్ రూమ్​కు ఫోన్ కాల్

కాగా, నరసింహస్వామి జయంతి(Narasimha Swamy Jayanti) ముగింపు వేడుకను ప్రత్యక్షంగా వీక్షిస్తూ దైవదర్శనం చేసుకునేలా భక్తులకు అవకాశం కల్పించామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా నిలిపివేసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణోత్సవాన్ని కూడా నేటి నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో పాటు శ్రీసుదర్శన నారసింహ హోమం కూడా నేటి నుంచి పునఃప్రారంభం అవుతుందని ఆలయ ఈవో తెలిపారు.