Nithyananda : నిత్యానంద చనిపోలేదు..క్లారిటీ వచ్చేసింది

Nithyananda : గత కొన్ని రోజులుగా నిత్యానంద అదృశ్యమయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు అధికారిక ప్రకటన రావడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Nityanotdead

Nityanotdead

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద (Nithyananda ) మరణించినట్లు వచ్చిన వార్తలకు తెరపడింది. నిత్యానంద స్థాపించిన స్వయం ప్రకటిత దేశం ‘కైలాస’ (Kailasa Country)తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఆయన ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టంగా పేర్కొంది. గత కొన్ని రోజులుగా నిత్యానంద జీవ సమాధి తీసుకున్నారని, మరణించినట్లు వార్తలు వచ్చాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించడంతో భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Police Notice : మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు

అయితే ‘కైలాస’ దేశం తాజాగా ఇచ్చిన స్పష్టీకరణ ప్రకటనలో నిత్యానంద సురక్షితంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నారని వెల్లడించింది. ఈ ప్రకటనతో భక్తుల్లో నెలకొన్న అనేక అనుమానాలు తొలగిపోయాయి. గత కొన్ని రోజులుగా నిత్యానంద అదృశ్యమయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు అధికారిక ప్రకటన రావడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

2011 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి నేటికి 14 ఏళ్లు.. కీల‌క పాత్ర పోషించిన యువీ!

కాగా నిత్యానంద గతంలో తన స్వంత దేశంగా ప్రకటించుకున్న ‘కైలాస’ గురించి కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ దేశం దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలో ఉన్నట్లు చెబుతున్నారు. నిత్యానంద గతంలో వివాదాస్పదమైన ఆరోపణల కారణంగా భారత్‌ను విడిచిపెట్టి, ఈ ‘కైలాస’ రాజ్యంలో స్థిరపడినట్లు సమాచారం. నిత్యానంద మరణించలేదని వచ్చిన తాజా ప్రకటనతో ఆయన అనుచరులు సంబరాలు జరుపుకుంటున్నారు.

  Last Updated: 02 Apr 2025, 12:50 PM IST