Vastu Tips: పారిజాత మొక్కను ఇంట్లో ఏ దిశలో నాటాలో తెలుసా?

Vastu Tips: చాలామంది వాస్తు శాస్త్రాన్ని బాగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకు అనుగుణంగా వాస్తు ప్రకారంగా ఇంటి నిర్మించుకోవడంతో పాటుగా, వాస్తు ప్రకారంగా ఇంట్లోని వస్తువులను అమర్చుకుంటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - October 20, 2022 / 07:50 AM IST

Vastu Tips: చాలామంది వాస్తు శాస్త్రాన్ని బాగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకు అనుగుణంగా వాస్తు ప్రకారంగా ఇంటి నిర్మించుకోవడంతో పాటుగా, వాస్తు ప్రకారంగా ఇంట్లోని వస్తువులను అమర్చుకుంటూ ఉంటారు. అయితే వాస్తు కేవలం ఇంటి నిర్మాణం విషయంలో ఇంట్లోనే వస్తువులు విషయంలో మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే చెట్లు మొక్కల విషయంలో కూడా వాస్తు విషయాలను పాటించాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంట్లో ఐశ్వర్యాన్ని పెంచే మొక్కలలో పారిజాత మొక్క కూడా ఒకటి. వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.
అందులో పారిజాత మొక్క కూడా ఒకటి. పారిజాత పుష్పం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనదని చెబుతూ ఉంటారు. అంతే కాకుండా పారిజాత మొక్క పువ్వులు కూడా సువాసన నన్ను వెదజల్లుతూ ఉంటాయి. అయితే ఈ పారిజాత పువ్వులు రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వాటిని ఇంట్లో నాటడం ద్వారా శాంతి నెలకొంటుందని చెబుతూ ఉంటారు. ఈ పారిజాత పుష్పాల వాసన కూడా చాలా బాగుంటుంది. పువ్వుల నుంచి వచ్చే వాసన ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను తొలగిస్తుంది .
ఈ పువ్వుల సువాసన మానసిక సమస్యలను నయం చేస్తుంది. దీని సువాసన కూడా మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. అదేవిధంగా పారిజాత మొక్కను వింటూ నాటడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. పారిజాత మొక్క పువ్వులను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు అన్న విషయం తెలిసిందే. ఆయుర్వేదంలో పారిజాత పుష్పాలతో అనేక రకాల వ్యాధుల నివారణకు మందులు తయారు చేస్తారు. ఇకపోతే ఇంట్లో పారిజాత మొక్కను వాస్తు ప్రకారంగా ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.