New Year: కొత్త సంవత్సరం రోజు ఈ వస్తువులను దానం చేస్తే చాలు.. కష్టాలన్నీ తొలగిపోవడం ఖాయం?

2023 కి గుడ్ బై చెప్పేసి 2024 కి ఆహ్వానం పలికే సమయం వచ్చేసింది. మరి కొన్ని గంటల్లో 2023 సంవత్సరం ముగియనుంది. అయితే హిందువులు కొత్త సంవత్సరం

  • Written By:
  • Publish Date - December 31, 2023 / 07:00 PM IST

2023 కి గుడ్ బై చెప్పేసి 2024 కి ఆహ్వానం పలికే సమయం వచ్చేసింది. మరి కొన్ని గంటల్లో 2023 సంవత్సరం ముగియనుంది. అయితే హిందువులు కొత్త సంవత్సరం మొదటి రోజున చాలా పవిత్రంగా భావిస్తారు. దానికి తోడు ఈసారి సోమవారం వచ్చింది. సోమవారం అంకితం చేయబడింది. కాబట్టి కొత్త సంవత్సరం ఒకటి అందులోను సోమవారం కావడంతో ఈ ప్రత్యేక దినంలో శివుని ప్రత్యేకంగా పూజించడం వల్ల శివుడిని పూజించడం వల్ల మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయనే నమ్మకం. ఈ రోజు మీ రాశిచక్రం ప్రకారం వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. మరి ఏ రాశి వారు ఏయే వస్తువులను దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మేషరాశి.. ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో శివాలయానికి వెళ్లి శివుడికి బటాషే సమర్పించి తర్వాత వాటిని దానం చేయాలి. ఇలా చేస్తే మీకు శుభ ఫలితాలు లభిస్తాయి.

అలాగే వృషభ రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజు డజన్ అరటి పండ్లను దానం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు కలుగుతుంది. కొత్త సంవత్సరంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి.

మిథున రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజు ఆవుకి గడ్డి లేదా బచ్చలు కూడా తినిపించడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది.

అలాగే కర్కాటక రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజు గుప్పెడు పిండిని తీసుకొని వాటిని గులికలను తయారు చేసే నదిలో చేపలకు ఆహారంగా వేయడం వల్ల అది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది..

అలాగే సింహ రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజు ఎర్ర పండ్లను దానం చేయాలి. యాపిల్ దానిమ్మ వంటి పండ్లను దానం చేయడం వల్ల సంతోషం శ్రేయస్సు లభిస్తుంది.

ఇక కన్యా రాశి వారు మొదటి సంవత్సరం ఫస్ట్ రోజు ఆకు పచ్చ రంగు వస్త్రాన్ని తీసుకొని ఇష్టమైన దేవుని ఆలయానికి వెళ్లి దేవుడికి సమర్పించి పూజించడం వల్ల అది మీ ఇంట్లో పురోగతి సంతోషాన్ని తెస్తుంది.

అలాగే తులా రాశి వారు తెల్ల ధాన్యాలను దానం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల గృహ దోషం వదిలిపోతుంది. సంవత్సరం మొదటి రోజున ఈ విధంగా చేయడం వల్ల కోరికలు కూడా నెరవేరుతాయి.

వృశ్చిక రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజు పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల అది మీకు సంతోషాన్ని శ్రేయస్సును కలిగిస్తుంది.

అలాగే ధనుస్సు రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజు తీపి పదార్థాలను దానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల అది మీ జీవితంలో సానుకూలతలను నింపుతుంది.

మకర రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజు ఏదైనా ఆలయానికి వెళ్లి కర్పూరం ప్యాకెట్ను దానం చేయాలి.

కుంభ రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజు పాలను దానం చేయడం వల్ల అది ఆ వ్యక్తి జీవితంలో శుభాలు కలిగేలా చేస్తుంది.

అలాగే మీన రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజున హనుమంతుని ఆలయానికి వెళ్లి మోతిచూర్ లడ్డును దానం చేయడం వల్ల అది మీకు శుభ ఫలితాలను అందిస్తుంది.