Slippers Inside Home: ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. దానికి తోడు సమస్యలు కూడా పెరిగిపోయాయి. అయితే మనుషులు జీవనశైలి

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 06:30 PM IST

కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. దానికి తోడు సమస్యలు కూడా పెరిగిపోయాయి. అయితే మనుషులు జీవనశైలిలో తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. పూర్వకాలంలో అప్పులు గుమ్మం బయట విడిచిపెట్టి లోపలికి వచ్చేవారు. బయటికి వెళ్లినప్పుడు మాత్రమే చెప్పులను ధరించేవారు. కానీ ఈ ప్రస్తుత రోజుల్లో మాత్రం చెప్పులు వేసుకుని ఇంట్లో తిరుగుతున్నారు.. పెద్దపెద్ద వాళ్ళు అయితే ఇంట్లోనే చెప్పులు వేసుకొని ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటారు.

బయటికి వెళ్ళినప్పుడు ఒక రకమైన చెప్పులు ఇంట్లో ఉన్నప్పుడే ఒక రకమైన చెప్పులను ధరిస్తుంటారు. అయితే ఎంత ధనవంతులు అయినా కూడా అలా ఇంటి లోపల చెప్పులు వేసుకుని తిరగడం అసలు మంచిది కాదు అంటున్నారు పండితులు. మరి ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..శని మన పాదాలకు సంబంధించినదని చెబుతారు. కాబట్టి పాదాలకు ధరించే బూట్లు, చెప్పులు రాహు కేతువులకు చిహ్నాలు. అలాగే ఇంటి మెయిన్ డోర్ వద్ద బూట్లు, చెప్పులు పెట్టకూడదు. ఎందుకంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. రాహువు, కేతువు వంటి దోష గ్రహాలు కూడా బూట్లు, చెప్పులు ధరించిన వ్యక్తితో ఇంట్లోకి ప్రవేశిస్తాయి.

అందుకే ఇంట్లో చెప్పులు ధరించడం నిషిద్ధం. ప్రత్యామ్నాయంగా, మీరు ఇంట్లో సాక్స్ ధరించవచ్చు. ఇంట్లో వంటగది, స్టోర్ రూమ్‌, పూజా గది మొదలైన వాటి ముందు బూట్లు లేదా చెప్పులు ధరించడం వల్ల డబ్బు, ధాన్యానికి కొరత ఏర్పడుతుంది. అలాగే గుమ్మం బయట చెప్పులు వదిలేటప్పుడు కూడా గుమ్మానికి కొద్దిగా దూరంగా వదిలాలి. చెప్పులు ఎలా పడితే అలా ఇష్టాను సారం కాకుండా వరుసగా వదలడం లేదంటే షూ ర్యాక్ లో పెట్టుకోవాలి. అలాగే మీరు బూట్లు, చెప్పులు విడిచేటప్పుడు, వాటిని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచకూడదు. మ‌ట్టి కొట్టుకుపోయిన‌ బూట్లతో ఇంటికి వచ్చి ఉత్తరం దిక్కున వాటిని తీసేస్తే మీ ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ నెగెటివ్ ఎనర్జీగా మారుతుంది. అదేవిధంగా ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మిదేవి కూడా అలాంటి ఇంట్లోకి ప్రవేశించదు. దాంతో ఆ ఇంట్లో ప్రతికూల శక్తి స్థిరపడుతుంది. అందువ‌ల్ల‌ మీరు మురికి బూట్లు, చెప్పులు ఉత్తర దిశలో ఎప్పుడూ తీసివేయకూడదు.

బదులుగా బూట్లు, చెప్పులు దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచవచ్చు. చిరిగిన, పాత బూట్లు ధరించడం వల్ల శని అశుభ నీడ మీపై పడి ఇంట్లో దారిద్య్రానికి కార‌ణ‌మ‌వుతుంది. శనివారం బూట్లు, చెప్పులు కొనకూడ‌దు. ఎందుకంటే శని వ్యక్తి పాదాలతో సంబంధం కలిగి ఉంటాడు. ఈ రోజు బూట్లు, చెప్పులు కొనడం వల్ల ఇంట్లో శని సంబంధిత సమస్యలు రావచ్చు.శని అశుభ ప్రభావాలను వదిలించుకోవడానికి, శనివారం నాడు ఆలయం వెలుపల నల్ల రంగు చెప్పులు, బూట్లను వదిలివేసి, వెనుకకు చూడకండా వ‌చ్చేయాలి. అలా చేయ‌డం వల్ల‌ శని దోషం నుంచి బయటపడవ‌చ్చ‌ని పెద్ద‌లు చెబుతారు.